బరువు తగ్గాలంటే వ్యాయామం కాదు.. అదే ముఖ్యమట?

praveen
సాధారణంగా మనలో అనేకమంది నిత్యం విపరీతంగా బరువు పెరిగిపోయాయని, పొట్ట పెరిగిపోయిందని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే? బాగా బరువు పెరిగే దాకా వారు వారి శరీరం పైన దృష్టి పెట్టరు. బరువు పెరిగాక, తీరా ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినపుడు మాత్రమే వారు వెంటనే బరువు తగ్గిపోవాలని తెగ కసరత్తులు చేసేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బరువు తగ్గడం అనేది పెరిగిన అంత ఈజీ కాదని గుర్తు పెట్టుకోవాలి. అవును, బరువు తగ్గాలి అనుకునే వారు ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. బరువు తగ్గాలంటే ప్రధానంగా ఉండాల్సింది ఏమిటంటే? నేను ఇంత బరువు తగ్గాలి.. అనే ఖచ్చితం నియమం. ఆ క్లారిటీ ఉన్నపుడు సమయం ఎక్కువైనా బరువు ఈజీగా తగ్గొచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అయితే మనలో చాలామంది వ్యాయామ నియమాలు పాటించడం వలన వెంటనే బరువు గగ్గిపోవచ్చు అనుకుంటారు. కానీ ఇది వాస్తవం అయినప్పటికీ దానికంటే ముఖ్యంగా మీరు తీసుకొనే డైట్ పై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే? మీరు తగ్గించాలి అనుకుంటున్న శరీర బరువు ఒక్కరోజులో పెరిగింది కాదనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలని భావించేవారు ఒకటేసారి బరువు తగ్గాలని ప్రయత్నం చేయకుండా, నిదానంగా బరువు తగ్గడం పైనే ఎక్కువ దృష్టి సారించాలి. ఒకటే సారి బరువు తగ్గాలని చేసే ప్రయత్నాలతో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.
తీసుకొనే ఆహారం విషయంలో ముందుగా శ్రద్ధ వహించాలి. తీసుకునే ఆహారం వెంటనే జీర్ణం ఎదిగా ఉండాలి. అంతేకాకుండా కడుపునిండా తినడం మానుకోవాలి. ఇంకా తినగలం అని అనుకొనే లోపే ఆహారం ముగిస్తే మంచిది. అపుడు శరీరంలోని కొవ్వు కరిగి, బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తరువాతే వ్యాయామం అని గుర్తుంచుకోవాలి. ఇక బరువు తగ్గాలంటే వదిలిపెట్టాల్సింది ముందు బరువుని కాదు... మీ బద్దకాన్ని. బద్దకంగా కూర్చోడం, బద్ధకంగా ఉండడం వలన శారీరక శ్రమ తగ్గి శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఏదైనా పని చేయాలంటే బద్దకిస్తూ పని చేయకుండా మానుకోవడం వంటివి చెయ్య కూడదు. బరువు తగ్గాలనుకునే వారు ఉండవలసిన ప్రధానమైన లక్షణం బద్ధకాన్ని వదిలించుకోవడం అని గుర్తు పెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: