కొబ్బరి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వదులుకోరు..!
కొబ్బరి పువ్వు ఎక్కువగా రోడ్లమీద కూడా ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు. అయితే కొబ్బరి పువ్వు థైరాయిడ్ సమస్యలను దూరం చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్ ఇతరత్రా వాటి నుంచి రక్షణ కల్పించడానికి కూడా పనిచేస్తుందట. థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ కొబ్బరి పువ్వుని తినడం వల్ల ఉపయోగకరం ఉంటుందట. అలాగే క్యాన్సర్ వంటి కణాలను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ ని సైతం తొలగిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్న వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందట.
కొబ్బరి పువ్వులో ఉండే ఖనిజాలు విటమిన్లు రేగులను రక్షించి మలబద్ధక సమస్యలు తగ్గించేలా చేస్తాయి. కొబ్బరి పువ్వులు కొబ్బరి నీటి కంటే ఎక్కువగా పోషకాలు కలిగి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంచేలా చేస్తుంది. కొబ్బరి పువ్వులు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయాలను రానివ్వకుండా చేస్తాయట.అలాగే ముఖంలో ముడతలు రాకుండా చేస్తుందట. మూత్రపిండాల ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేలా చేస్తుంది. ఎవరైనా పనిచేసిన వెంటనే అలసిపోతే ఈ పువ్వు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కొన్ని భాగాల నుంచి ఇది తగ్గించేలా చేస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా కొబ్బరి పువ్వు చేస్తుందట.