Paneer: original VS Fake.. ఈ చిన్న ఛేంజ్ తో టక్కున గుర్తుపట్టేయచ్చు..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కత్లీ అనేది పెరిగిపోతుంది. ప్రోటీన్ అవసరం అందరికీ ఎక్కువగా ఉండటంతో, చాలా మంది డాక్టర్లు కూడా రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను పుష్కలంగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా నాన్-వెజిటేరియన్ ఆహారం తీసుకోని వారికి పన్నీర్ ఒక ఉత్తమమైన ప్రోటీన్ అని చెప్పుతున్నారు. పన్నీర్‌తో తయారయ్యే వంటకాల రుచులు కూడా కారణమై, పన్నీర్ డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే ఇంతగా డిమాండ్ పెరగడంతో మార్కెట్లో నకిలీ పన్నీర్ (ఫేక్ పన్నీర్) ఉత్పత్తి కూడా పెరిగిపోయింది. కొన్ని హోటళ్లలో, బేకరీల్లో, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఫేక్ పన్నీర్ వాడకాన్ని ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు. దీంతో అసలు పన్నీర్ ఏది ఒరిజినల్..? నకిలీ పన్నీర్ ఏది..? అనే విషయంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కానీ నిపుణులు చెబుతున్న కొద్దిపాటి టిప్స్ తెలుసుకుంటే పన్నీర్ నిజమా నకిలీదా అనేది సులభంగా గుర్తించవచ్చు. వాటి గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!




*పన్నీర్ ప్యాకెట్‌లో ఉన్నప్పుడు అసలు ఓరిజినల్ పన్నీర్ కాదా..? అని కంటితో చూసి చెప్పడం కష్టం. కానీ చేతితో ముట్టుకుంటే వెంటనే తేడా తెలుస్తుంది.

* ఒరిజినల్ పన్నీర్: చేతితో నెమ్మదిగా ఒత్తినప్పుడు ఇది మృదువుగా, దూదిలా అనిపిస్తుంది.

* ఫేక్ పన్నీర్: గట్టిగా రబ్బరు లా “కచక్ కచక్” అన్నట్లు అనిపిస్తే, అది నకిలీ పన్నీర్ అని అర్థం. ఈ పన్నీర్ టచ్ ధర్మకోల్ షీట్లలా పలుకు పలుకుగా ఉంటుంది.

* నీటి పరీక్ష: చిన్న ముక్క పన్నీర్‌ని నీటిలో వేసి కూడా దీని నాణ్యత తెలుసుకోవచ్చు

* ఒరిజినల్ పన్నీర్: నీటిలో వేసిన వెంటనే దిగిపోతుంది.

* ఫేక్ పన్నీర్: నీటిపై తేలుతూ ఉంటే, అది పొడిలతో  తయారైన నకిలీ పన్నీర్ అని అర్థం.

* పన్నీర్‌ని వంటలో ఉపయోగించే ముందు వేడి చేసినా దీని నాణ్యత సులభంగా తెలుస్తుంది.

* ఒరిజినల్ పన్నీర్: వేడి చేసినప్పుడు కరగదు, కేవలం రంగు కొద్దిగా మారుతుంది.

* ఫేక్ పన్నీర్: వేడి చేసినప్పుడు ఆయిల్ బయటకు రావడం, ముక్కలు ముక్కలుగా పొడిగా విరిగిపోవడం జరుగుతుంది. దీన్ని క్రీమ్ పొడి వాడి తయారు చేసిన పన్నీర్‌గా గుర్తించవచ్చు.

* షాపులోనే ప్యాక్ చెక్ చేయడం : ప్యాకెట్ కట్ చేయకుండానే పన్నీర్ నాణ్యత కొంతవరకు తెలుసుకోవచ్చు.

* మృదువైన, దూదిలాంటి తాకుడు ఉంటే అది ఒరిజినల్ పన్నీర్.

* గట్టిగా, రబ్బరు లా పలుకు పలుకుగా అనిపిస్తే అది నకిలీ పన్నీర్.


ఆరోగ్యానికి మేలు కలిగించే పన్నీర్ ఎప్పుడూ తాజా పాలను మరిగించి తయారు చేసినదే. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పన్నీర్ ఎక్కువగా పౌడర్, రసాయనాలు కలిపి తయారవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇంట్లోనే పన్నీర్ తయారు చేయడం ఉత్తమం. కొనుగోలు చేయాల్సి వస్తే మంచి  బ్రాండ్‌ నుండి మాత్రమే కొనడం మంచిది. ఈ విధంగా పన్నీర్ నిజమా కాదా అనేది సులభంగా గుర్తించవచ్చు. ఆరోగ్యానికి హానికరమైన ఫేక్ పన్నీర్ వాడకాన్ని తగ్గించి, ఒరిజినల్ పన్నీర్ వాడటం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను సమృద్ధిగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: