ఉన్నట్టుండి జుట్టు గుప్పలు గుప్పలుగా ఊడిపోతుందా..? అయితే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
1. హార్మోన్ల మార్పులు
టీనేజ్ అనేది శరీరంలో అనేక మార్పులు జరిగే దశ. ఈ సమయంలో హార్మోన్ల స్థాయిలు వేగంగా మారుతుంటాయి. ముఖ్యంగా అబ్బాయిలలో టెస్టోస్టెరాన్, అమ్మాయిలలో ఎస్ట్రోజన్ వంటి హార్మోన్లలో మార్పులు రావడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది.
ఈ హార్మోన్ల మార్పుల కారణంగా:
చర్మం జిడ్డుగా మారడం,మొటిమలు రావడం, మూడ్ స్వింగ్స్,అలాగే జుట్టు రాలడం కూడా సాధారణంగా కనిపిస్తుంది. ఇది చాలా సందర్భాలలో సహజమే అయినా, జుట్టు ఎక్కువగా రాలుతున్నట్టు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే హార్మోన్ల అసమతుల్యత ఎక్కువైతే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది.
2. పోషకాహార లోపం
టీనేజ్ వయస్సులో శరీరానికి ఎక్కువ పోషకాలు అవసరం. కానీ ఈ రోజుల్లో చాలా మంది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ముఖ్యంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో:
ప్రోటీన్ లోపం,ఐరన్ లోపం,విటమిన్ డ్,విటమిన్ భ్12, మెగ్నీషియం లోపం.. ఇవన్నీ సాధారణంగా కనిపిస్తాయి. ఈ పోషకాలు జుట్టుకు బలం ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తక్కువైతే జుట్టు మూలాలు బలహీనపడతాయి, స్కాల్ప్ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.
3. మానసిక ఒత్తిడి (స్ట్రెస్)
టీనేజ్ అనేది చదువు, పరీక్షలు, భవిష్యత్తు ఆలోచనలు, కుటుంబ ఒత్తిళ్లు, స్నేహితులతో సమస్యలు వంటి అనేక విషయాలతో నిండిన దశ. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
అతిగా ఒత్తిడి ఉంటే:
తల బరువుగా అనిపించడం,నిద్రలేమి,అలసట , జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. విపరీతమైన స్ట్రెస్ వల్ల తలకు సరిపడా ఆక్సిజన్ అందదు. దాంతో స్కాల్ప్‌లో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టు మూలాలు బలహీనమై వెంట్రుకలు ఊడిపోతాయి.
4. ఆహారపు అలవాట్లలో మార్పులు
ఈ వయస్సులో ఆహారపు అలవాట్లు కూడా చాలా మారిపోతాయి. టైమ్‌కు భోజనం చేయకపోవడం, బ్రేక్‌ఫాస్ట్ మానేయడం, డైట్ పేరుతో తక్కువ తినడం వంటి అలవాట్లు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
ఆహారంలో తప్పనిసరిగా:
ఆకుకూరలు,తాజా కూరగాయలు,పండ్లు,డ్రై ఫ్రూట్స్,పాలు, పెరుగు,గుడ్లు, పప్పులు వంటి పోషకాహారం ఉండాలి. విటమిన్ల లోపం రాకుండా అవగాహనతో ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
5. తప్పుడు హెయిర్ కేర్ అలవాట్లు
టీనేజ్‌లో స్టైలింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. తరచూ:
హెయిర్ జెల్స్,స్ప్రేలు ,స్ట్రెయిటెనర్లు,కలరింగ్..వంటివి వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అలాగే తడి జుట్టును గట్టిగా దువ్వడం, బిగువుగా కట్టుకోవడం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.
టీనేజ్‌లో జుట్టు రాలడం అనేది శాశ్వత సమస్య కాదు. ఇది ఎక్కువగా తాత్కాలికమే. సరైన పోషకాహారం, ఒత్తిడి తగ్గించడం, మంచి జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.