తాటి ముంజెలు తినే వేళ ఇదే! పరిపూర్ణ ఆరోగ్యం కోసం ముంజెలు తినాల్సిందే

ప్రకృతి ఎంతో చిత్ర విచిత్రాల సంయుక్తం.  దాని కారణంగా వచ్చే ప్రతీ సమస్యకు విరుగుడునూ చూపిస్తుంది. ఒకవైపు  ఎరట్రి ఎండలతో చెమటలు కక్కి వడలిపోయేలా చేస్తుంది. వడదెబ్బ ప్రతాపాన్ని రుచి చూపిస్తుంది. సూర్యుడు పైపు వేసుకుని మనిషిలోని నీటిని మెుత్తం తాగినట్లు కొద్ది సేపు ఎండలో తిరిగితే నీరసం ఆవహిస్తుంది.

అయితే దీని నుంచి బయటపడడానికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో మనకు వేసవిలో గుర్తుకు వచ్చేవి మూడు.


తాటి ముంజలు,
పుచ్చకాయలు, 
కొబ్బరినీళ్లు.


ఇవి నీరసపడిన మనిషికి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. వీటిలో కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ గురించి ముందే తెలుసు. సమ్మర్ లో మాత్రమే దొరికే  "కూలింగ్ ప్రూట్స్" లో "తాటిముంజలు లేదా ఐస్ ఆపిల్స్ " కూడా ఒకటి. వేసవి తాపాన్ని హరించి అతి రుచికరమైన తక్షణ శక్తినిచ్చే ఆహారం. తాటి ముంజల్లో వుండే కొబ్బరినీళ్ళ లాంటి తియ్యటినీళ్ళు మీదపడ కుండా తినటం ఒక సరదా! వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటిముంజలు, పుచ్చకాయలు ప్రజలు బానుడి తాపన్ని తట్టుకునేందుకు అత్యంత ప్రియంగా విటిని తింటారు. అదేవిధంగా శీతాల పానియాలపై కూడా ఎక్కువ మోజు చూపుతారు.అందులో భాగంగానే వేసవి కాలంలో వచ్చే తాటిముంజలకు బలే గిరాకి పెరిగింది.


వేసవిలో విరివిగా లభించే వీటివల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు, అందానికి ఎంతో మేలుచేస్తాయివి. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని "ఐస్ ఆపిల్"  అంటారు. తాజాగా ఉండే ఈ తాటిముంజ 'జ్యూసీ లిచీ ఫ్రూట్'  లా ఉంటుంది మరియు రుచి తాజా లేలేత కొబ్బరి బోండాం టేస్ట్ కలిగి ఉంటుంది.


కాలిన గాయాలకు,మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు ఈ క్రింది విధంగా కాలిన గాయాలకు,మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా


ఎండాకాలంలో తాటిముంజలు లభిస్తాయి. వీటిని ఈ కాలంలో తినడంవల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్ని చల్లబరిచేగుణం ముంజల్లో ఎక్కువగా ఉంటుంది. ముంజ ల్లో విటమిన్ ఎ, బి, సి,ఐరన్ జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి అనేక ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అనవసర పదార్థాలను బయటికి పంపుతాయి. ఈ కారణంగా శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. వీటిని తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. వీటిలోని నీటిశాతం పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.


ఈ కారణంగా త్వరగా ఆకలి వేయదు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ముంజలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం ముంజలకు ఉంటుంది. వీటిని తినడం వల్ల అలసట తగ్గుతుంది. మిగతా సమయాలతో పోల్చుకుంటే ఈ నిండు వేసవి కాలంలో వీటిని తీసుకోవడంవల్ల అలసట, నీరసం దూరమై తక్షణశక్తి పొందుతాం. వేసవిలో విరివిగా మనకు అందుబాటులో ఉండే ఈ పండ్లు చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. కానీ, ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. శరీరానికి తగినంత "కూలింగ్ ఎఫెక్ట్" ను అందిస్తుంది.


వేసవిలో సర్వ సాధారణమైన మలబద్ధక సమస్యను నివారించడంలో తాటి ముంజలు బాగాపనిచేస్తాయి. క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడంవల్ల ఎన్నో లాభాలుంటాయి. కేవలం ఆరోగ్యపరంగానే కాదు. అందంపరంగా కూడా ముంజలు బాగా పని చేస్తాయి వీటిని తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి. కాబట్టి కేవలం ఎండాకాలం లోనే దొరికే ఈ ప్రకృతి ప్రసాదాన్ని ఈ అద్భుత ఆహారాన్ని వదులుకోవద్దు.

తాటి ముంజలతో వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో చికెన్ పాక్స్ నివారించడం ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్. ఇందులో చల్లదనం వల్ల శరీరానికి కావల్సినంత చల్లదన్నాన్ని అందిస్తుంది. వేసవిలో చికెన్ పాక్స్ వస్తే, తాటిముంజలు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తాటిముంజలు తీసుకోవడం వల్ల నిధానంగా లివర్ సమస్య లను తగ్గించుకోవచ్చు . వీటిలో ఉండే అధిక పొటాషియం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి అద్భుతంగా సహాయపడతుంది

వేసవి కాలంలో ప్రిక్లీ-హీట్ ను తగ్గిస్తుంది మరియు చెమటకాయలను నివారిస్తుంది. తాటి ముంజల పొట్టును తీసి చర్మానికి మర్ధన చేయడం వల్ల, చెమటకాయలు తగ్గించడంతో పాటు, చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. ముంజల్లో ఉండే ఫైటో కెమికల్స్, ఆంతోసినిన్ శరీరంలో ట్యూమర్స్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా నిరోధిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: