ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

ఉరుకుల పరుగుల జీవితం, క్షణం తీరికలేని జీవన శైలితో చాలా మంది పనికి ఇచ్చిన ప్రాధాన్యత తమ ఆరోగ్యం, తీసుకునే ఆహారం పట్ల తీసుకోరు. ఎప్పుడు ఏం తీసుకుంటున్నారన్నది పట్టించుకోరు. కానీ పరగడుపున తీసుకునే ఆహారం, చేసే పనుల మీద శ్రద్ధపెట్టడం మంచిదంటున్నారు డాక్టర్లు.
 
పరగడుపున నీళ్లు తాగడం ఎంత మంచిదైతే. శీతల పానియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్లర్లు చెబుతున్నారు. ఆలస్యంగా లేచినప్పుడు అలవాటులో భాగంగా సోడా ఇతర కూల్‌డ్రింక్స్‌ను తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే అమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలను సృష్టిస్తాయి. వికారం, వాంతుల వంటివి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది. వీటన్నింటికంటే ఉదయాన లేవగానే మంచినీళ్లు తాగడం చాలా మంచిది.
 
ఘాటైన మసాలాలు, గ్రేవీ కూరల్ని ఉదయం పూట తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే పొట్టలో తిప్పుతుంది. రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్‌బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం పూట సాధ్యమైనంత వరకు తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం మర్చిపోవద్దు.
 
ఉదయానే బెడ్‌కాఫీ, టీ తాగడం చాలా మంది చేసే పనే కానీ అదంత మంచిది కాదని డాక్టర్స్‌ఒపీనియన్‌. ప్రొద్దుటే వాటిని తాగడం మంచిదే అయినా.. పరగడుపున తీసుకోకపోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదట ఓ గ్లాస్‌మంచనీళ్లు తాగి ఓ పది నిమిషాల తర్వాత కాఫీ, టీ లాంటివి తాగడం శ్రేయస్కరం.
 
ఉదయాన్నే పుల్లని పధార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. టమాటా లాంటివి పరగడుపున తీసుకోకూడదు. చాలా మంది టొమాటో బాత్‌, టొమాటో రైస్‌వంటివి తింటుంటారు. ఇలాంటివి తినేముందు నీళ్లు లేదా పాలు తాగడమే లేక వేరే పధార్థాలేమైన తినడమో ఆరోగ్యానికి మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: