మీ థైస్ బరువు తగ్గాలంటే..

Durga
 ఒక్కొక్కరి శరీరం ఒక్కొక తీరు ప్రత్యేకం. వారి వారి శరీరానికి అనుకూలమైన కదలికలు ఉంటాయి. కొన్ని అన్ న్యాచురల్ అనారోగ్యాన్ని కలిగిస్తుంది, చక్కటి శరీర ఆకృతిని కూడా దెబ్బతీస్తుంది.
ప్రతి కదలిక ప్రత్యేకమైనదే కాక దానికి తగిన సౌకర్యము పరిధి ఉంటాయి . ఈ కింద ఉదాహరించిన చిట్కాలతో తోడల అధిక బరువు ఉన్నవారు చేసే చూడండి.

- నిటారుగా నిల్చుని, మీ పాదాలు 30 సెంటి మీటర్ల దూరం ఉంచి మీ పిరుదుల పైన మీ రెండు చేతులు బొటనవేళ్ళు ముందుకు ఉండే విధంగా ఉంచండి .

- ముప్పై సెకనులు మీ పొత్తి కడుపుని క్లోక్ వైస్ గా తిప్పండి. ఆపి, తర్వాత వ్యతిరేక దిశ లో ముప్పై సెకనులు తిప్పండి. ఈ విధం గా ఆరు సార్లు చెయ్యండి. గమనిక : మీ పాదాలు ఈ వ్యాయమం చేసేటప్పుడు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోండి.

-పైన చెప్పిన విధంగా నిల్చోండి. కుడి తొడని మీకు సౌకర్యవంతమైన దూరం ముందుకి ఉంచి మీ పొత్తికడుపు ను క్లాక్ వైస్ గా ముప్పై సెకనులు తిప్పండి . ఆపి , ఇప్పుడు వ్యతిరేక దిశలో మరొక ముప్పై సెకనులు తిప్పండి. గమనిక : పూర్తి చేసాక యథాస్థితికి రండి .

- ఇప్పుడు మీ ఎడమ తొడని ముందుకు పెట్టి, పొత్తికడుపు ను క్లాక్ వైస్ గా ముప్పై సెకనులు తిప్పండి. ఆపి వ్యతిరేక దిశ లో ముప్పై సెకనులు తిప్పండి . గమనిక : పూర్తి చేసాక తిరిగి యథాస్థితిలోకి రావాలి.  

-ఇప్పుడు మీ పాదాలు కదపకుండా మీ పొత్తికడుపుని కుడి వైపు 15 నుండి 20 సెంటి మీటర్లు కదపండి; గమనిక : ఇది మీ కొత్త ప్రధమ స్థితి.

- ఇప్పుడు మీ శరీరాన్ని ముప్పై సెకనులు క్లాక్ వైస్ గా తిప్పండి. బాలన్స్ తప్పకుండా జాగ్రత్త వహిస్తూ వ్యతిరేక దిశలో మరొక ముప్పైసెకనులు తిప్పాక మీ పొత్తికడుపుని మధ్య లోకి తెండి.

-ఇప్పుడ మీ పొత్తికడుపుని ఎడమ వైపుకు కదిపి పైన చెప్పిన విధం గా వ్యాయామం చేయండి.

- పూర్తీ చేసాక మీ పొత్తికడుపుని మధ్యలోకి ఉంచండి. దీనితో మీ వ్యాయామం పూర్తి అయింది. ఇతర సూచనలు మొదటినుంచి చివరి వరకు ఈ వ్యాయామం ఆపకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: