వంకాయతో మధుమేహం - టొమాటో తో రక్తపోటు మటుమాయం





"వంకాయ వంటి కూర పంకజ ముఖి సీత వంటి భార్య"  అన్నారు కదా! సహధర్మచారిణిగా, ధర్మపత్నిగా సీత ఎంతో కీర్తి ప్రతిష్ట లు పొందారు. అంతటి కీర్తి కూరల్లో వంకాయ కూరకుందని తెలుగు నానుడి.





వంకాయ అనగానే ఆంధ్రులకు నోరూరిపోతుంది. గుత్తివంకాయ కూర ప్రాచుత్యాన్ని గురించి ఒక సినిమాపాట కూడా వచ్చింది. రుచికి వంకాయను మించింది లేదని అంటారు. ఇక వివాహా వేడుకలో గానీ ఫంక్షన్ల లో గానీ వంకాయ ఖచ్చితంగా కనిపిస్తుంది లేకుంటే ఆ విందు పసందు కాదట. అయితే ఇప్పుడు ఆరోగ్యానికి కూడా వంకాయ సూపర్ గా పనిచేస్తుందట. వంకాయను ఆహారంగా ఖచ్చితంగా తీసుకోవలసిందే అని నిపుణులు అంటున్నారు . 




"వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్ , యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. వయస్సు ఛాయలు కనిపించనీయవు. శరీరంపై ముడతలు వీటితో మటుమాయం. శరీరంలో వాపు, నరాల బలహీనత తగ్గించే శక్తి వంకాయలకు ఉంది" అని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటీసుతో బాధపడేవారు దీన్ని ఎంత ఎక్కువ ఆహారములో  తీసుకుంటే అంతమంచిదని వారు సూచిస్తున్నారు. దీనిలో తక్కువ మోతాదులో గ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని కారణంగా దీన్ని ఎంత ఎక్కువ తీసుకున్నా ఆరోగ్యానికి హాని చేయదని వారు అంటున్నారు. 


వంకాయ కురను టమాట తో కలిపి చేయటం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే టమటలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ప్రత్యేకించి హై బ్లడ్ప్రెషరును అంటే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఈ మద్య మదుమెహం రక్తపోటు అధికంగా ప్రజల్లో కనిపిస్తున్న జబ్బులు. వీటికి ఒక ప్యాకేజి గా వంకాయ్ టమట కూర వారానికొక్కసారి ఆహారములో తింటే ఆరోగ్య ప్రయోజనము ఉంటుందంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: