శరీరంలో హై కొలెస్ట్రాల్ కి కారణాలు ఇవే

Bhavannarayana Nch

హై కొలెస్ట్రాల్..దీనినే అధిక కొవ్వు అని అంటారు..అధిక కొవ్వు శరీరంలో అనేక రకాల మార్పులకి కారణం అవుతుంది..ఎన్నో అనారోగ్య సమస్యలకి కూడా కారణం హై కొలెస్ట్రాల్ అని వైద్యులు చెప్తున్నారు.మనం తినే ఆహరం ద్వారా మాత్రమే అధిక కొవ్వు కలుగడం లేదు దీనికి అనేక రకారలైన కారణాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు వైద్య నిపుణులు.

 

శరీరంలో అధిక కొవ్వు పదార్థాలు ఏర్పడటానికి గల కారణాల గురించి  తెలుసుకుందాం.. మిల్క్, ఎగ్స్, బటర్, బీఫ్

మరియు చీస్ మరియు నిలువ చేయబడిన ఆహార పదార్ధాలు అయిన  కొబ్బరి నూనె..పామ్ ఆయిల్.. లేదా కోకోవా బటర్ వంటివి అధిక మొత్తంలో ఉంటాయి..ఇవి శరీరంలో కొవ్వు స్థాయిలను పెంచుతాయి. అందుకే వీటిని దూరంగా ఉంచడం చాలా ముఖ్యమైన విషయం.

 

చలా మంది వ్యక్తులు తాము ఆహరం ఎంత ఎక్కువగా తీసుకున్నా సరే వారికి ఉండే చురుకుదనం వలన కొవ్వు పట్టకుండా ఉంటుంది..కానీ చాలా మంది మాత్రం మందంగా..చురుకుగా లేకపోవడం,,ఎప్పుడు నీరసంగా ఉండటం వలన వారిలో కొవ్వు స్థాయిలు పేరుకు పోతాయి..కావున, రోజు వ్యాయామాలు చేయటం ద్వారా చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గి మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయి.వయసుతో పాటే కొవ్వు స్థాయి కూడా శరీరంలో పెరుగుతుంది..45 ,55 వయస్సులో ఉండే స్త్రీ పురుషులలో కొవ్వు పదార్ధాల స్థాయి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఈ అధిక కొవ్వు కలుగుతుంది...సిగరెట్ ను త్రాగే వారిలో కూడా ఈ కొవ్వు స్థాయిలు హెచ్చులో ఉంటాయి..అందుకే సిగరెట్స్ మానేయటం ద్వారా శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: