"పసుపు వేసిన కొబ్బరి పాల" లాభాలు తెలిస్తే షాక్ అవుతారు

Bhavannarayana Nch

పాలు..శరీరానికి ఎంతో ఆరోగ్యమైనవి..ఎముకలు ధృడంగా ఉండటానికి..మనిషి ఎంతో శక్తివంతమైన ఆరోగ్యాన్ని పొందటానికి ఇవి ఇంతో ముఖ్యమా చిన్నప్పటి నుంచీ అందరు క్రమం తప్పకుండ తాగుతూ ఉంటాము..అయితే ఈ పాలలో కంటే కూడా ఎక్కువ పోషకాలు మరొక పాలలో ఉన్నాయి..వాటిలో అయితే కొవ్వు కలిగించే పదార్ధాలు లేకపోగా అనేక ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగి ఉంటాయి..

 

 

ఇంతకీ ఏమి పాలు అనేగా మీరు ఆలోచించడి..కొబ్బరి పాలు..కొబ్బరి నుంచీ తీసిన పాలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వాటిని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండచ్చు అని వైద్యులు సలహా ఇస్తున్నారు.ఈ కొబ్బరి పాలలో విటమిన్లు కూడా అధికంగా ఉంటాయట..కొబ్బరి పాలలో పీచు..విటమిన్, సీ , ఇ , బీ1 మరియు “ బీ3, బీ6,  ఐరన్, సెలీనియం”  “క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్” వంటి పోషకాలుంటాయి.వీటి వలన లాక్టోస్ ఉండదు అంతేకాదు కొబ్బరి పాలు మనం రోజు త్రాగే పాలకి ప్రత్యామ్నాయం గా పనిచేస్తాయి.

 

అయితే శరీరంలో కొవ్వుని కలిగించే పదార్ధాలు మాత్రం వీటిలో ఉండవు..కొబ్బరి పాలలో ఉండే  లారిక్ యాసిడ్.. హాని కారక బ్యాక్టీరియా.. వైరస్‌లను నశింపచేస్తుంది..అందువల్ల ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. ఇంకా వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కొబ్బరి పాలలోకొంచం పసుపు కనుకా వేసుకుని త్రాగితే కడుపులో ఉండే అల్సర్లు కూడా పోతాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

 

ఈ కొబ్బరి పాలలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏమిటి అంటే వీటిలో ఉండే..ఫాటీ యాసిడ్ ద్వారా గుండె గోడల్లో కొవ్వు చేరనీయకుండా అడ్డుకుని..గుండె జబ్బులు రాకుండా చేస్తుంది..నారాలు ,ఎముకల బలాన్నికి ఉపయోగపడే మెగ్నీషియం కాల్షియం కొబ్బరి పాలలో లభ్యం అవుతుంది..అంతేకాదు  ఇవి కండరాల్లో ఏర్పడే నొప్పిని దూరం చేస్తాయి. కొబ్బరిపాలలో శరీరానికి అవసరమయ్యే 25 శాతం ఐరన్ లభిస్తుంది. అందుకే కొబ్బరి పాలని కనీసం వారానికి మూడు రోజులు త్రాగటం మంచిది అని చెప్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: