ఈ లక్షణాలు ఉంటే "లివర్" సరిగా పనిచేయడం లేదని అర్థం

Bhavannarayana Nch

మనిషి శరీరానికి లివర్ ఎంతో ముఖ్యమైన అవయవం.శరీరంలో ఉండే మలినాలని బయటకి పంపడానికి ఇవి ముఖ్యంగా ఉపయోగపడుతాయి..ప్రోటీన్లను జీర్ణం చేయడంలో, జీర్ణక్రియకు అవసరమైన రసాయనాలను విడుదల చేయడంలో లివర్‌దే ముఖ్య పాత్ర. అంతేకాదు రక్తంలో ఉండే మృత కణాలను..బాక్టీరియా.. హానికర హార్మోన్లను కూడా లివర్ తొలగిస్తుంది. దీంతో లివరే కాదు, శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.

 

లివర్ కనుక సరిగా పని చేయకపోతే డై ప్రభావం..శరీరంలో ఇతర అవయవాల పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి...అందుకే ప్రతీ ఒక్కరు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అనారోగ్యం బారిన పడినప్పుడు మనలో కనిపించే అనారోగ్య లక్షణాలు, సూచనలను మనం తెలుసుకోవాలి. దీంతో లివర్ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. మరి లివర్ అనారోగ్యానికి గురైందని తెలియజేసే ఆ లక్షణాలు ఏమిటో మీరు చుడండి..

1. లివర్ సరిగ్గా పనిచేయకపోతే ఎవరికైనా తీవ్రమైన అలసట వస్తుంది. ఏ పని చేద్దామన్నా నీరసంగా ఉంటుంది. ఉదయం లేవగానే బద్దకంగా అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి

 

2 గురక ఎక్కువగా వస్తున్నా కూడా లివర్ సమస్య ఉందని తెలుసుకోవాలి. లివర్ ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా చాలా మందిలో గురక వస్తుంటుంది

 

 3.ఎంత చలిలో ఉన్నప్పటికీ శరీరానికి విపరీతంగా చెమట పోస్తుంది అంటే లివర్ బాగా లేనట్టే లెక్క. దీనికి తోడు ఆ చెమట దుర్వాసన వస్తుంటుంది. అంతేకాకుండా నాలుకపై పసుపు రంగులో కోటింగ్ ఏర్పడుతుంది. నోరు దుర్వాసన వస్తుంటుంది. ఈ లక్షణాలు ఉంటే లివర్ అనారోగ్యంగా ఉందని తెలుసుకోవాలి. 


4 . గురక ఎక్కువగా వస్తున్నా కూడా లివర్ సమస్య ఉందని తెలుసుకోవాలి. లివర్ ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా చాలా మందిలో గురక వస్తుంటుంది. 

5. కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు బాగా ఉంటే లివర్ ఆరోగ్యంగా లేదని గుర్తించాలి. అంతేకాకుండా ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా బరువు తగ్గకపోతుంటే లివర్ సమస్య ఉన్నట్టు తెలుసుకోవాలి. 


6. లివర్ సమస్యలు ఉన్న వారి శరీరం లేత పసుపు రంగులో కనిపిస్తుంది. దీంతోపాటు చర్మంపై ర్యాషెస్ వస్తాయి. చర్మం దురద పెడుతుంటుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. కళ్లు ఉబ్బిపోయి ఉంటాయి. మొటిమలు బాగా వస్తాయి.

7 లివర్ సరిగ్గా పనిచేయకపోతే అలాంటి వ్యక్తులు ఎప్పుడు చూసినా మూడీగా ఉంటారు. కోపం వస్తుంటుంది. తలనొప్పి వస్తుంది. 

8. లివర్ ఆరోగ్యం బాగా లేకపోతే జీర్ణ సమస్యలు వస్తుంటాయి. గ్యాస్, మలబద్దకం, డయేరియా, అసిడిటీ తరచూ వస్తాయి. 

9. లివర్ సరిగ్గా పనిచేయకపోతే వచ్చే మరో సమస్య శృంగార సామర్థ్యం నశించడం. లేదంటే శృంగారంపై ఆసక్తి కూడా ఉండకపోవడం. లివర్ పనిచేయకపోతే హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కావు. వాటి క్రమబద్దీకరణ గాడి తప్పుతుంది. ఫలితంగా అది శృంగార సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: