“కిడ్నీ వ్యాధి” లక్షణాలు గురించి తెలియని నిజాలు..ఇవే

Bhavannarayana Nch

చాలా మందికి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలుసు..ఎటువంటి ఆహరం తినడం వలన ఆరోగ్యం పాడవుతుందో కూడా తెలుసు కానీ అలాంటి వారికి కానీ ఎంతో మందికి కానీ ఒక వ్యాధి శరీరంలోకి ప్రవేశిస్తే ఆ వ్యాధి తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అంటే తెలియదు అంటారు..ఒక భాగానికి అనారోగ్యం వస్తే మరొక భాగానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది..మరి అలాంటి సమయంలో మనం ఈ సమస్యలని గుర్తించడం కష్టం అయితే కొన్ని కొన్ని లక్షణాల ద్వారా ఆ వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు. అయితే చాలా మంది ఎదుర్కునే అతిపెద్ద సమస్య కిడ్నీ సమస్య..

 

అయితే ఈ కిడ్నీ సమస్య అనేది ఎక్కువ మందికి రావడానికి కారణం ఏమిటంటే ఎక్కువగా మంచినీళ్ళని తీసుకోక పోవడం.. అయితే కిడ్నీ వ్యాధులు వచ్చినప్పుడు వాటిని ఎలా గుర్తించాలి అనే విషయంలోకి వెళ్తే..కిడ్నీల యొక్క ముఖ్యమైన విధి ఏమిటంటే శరీరంనుంచి టాక్సిన్స్ ను తొలగించడం కిడ్నీల ప్రాధమిక విధి. టాక్సిన్స్ ను బ్లాడర్ లో కి పంపిస్తుంది. యూరినేట్ చేస్తున్నప్పుడు ఈ టాక్సిన్స్ తొలగిపోతాయి...ఆ విధంగా ప్యురిఫికేషన్ జరుగుతుంది..అయితే కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే..రక్తం నుంచి వ్యర్థాలను తొలగించే సామర్థ్యం కిడ్నీలలో తొలగిపోయినప్పుడు కిడ్నీ లు ఫెయిల్ అయ్యాయని అర్థం. వివిధ దీర్ఘకాల వ్యాధులు, పర్యావరణ కాలుష్యం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి.

 

అయితే కొన్ని అత్యంత సాధారణ లక్షణాల ద్వారా వీటిని గుర్తించవచ్చు..ఎలా అంటే..ఆరోగ్యం గా ఉండే  కిడ్నీలు ఎరిత్రోపొయిటిన్ లేదా EPO అనే హార్మోన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ ని క్యారీ చేసే ఆక్సిజెన్ ని తయారుచేయమని శరీరానికి సూచిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, కిడ్నీలు EPOలను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అందువలన శరీరం త్వరగా అలసిపోతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండటం వలన ఇది జరుగుతుంది.


అంతేకాదు కిడ్నీలకు సంబంధించిన శ్వాస సమస్యలు కూడా ఉంటాయి శరీరంలోని పేరుకుపోయిన అదనపు ద్రవాలు లంగ్స్ లో కి చేరి అక్కడ అనీమియా వలన శరీరానికి ఆక్సిజన్ తగినంతగా అందదు..ఈ రెండు సమస్యల వలన శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయి...కాళ్ళు చేతులలో వాపులు కనిపిస్తే, కిడ్నీ ఫెయిల్యూర్ కి అవి సూచనలు కావచ్చు. కిడ్నీ ఫెయిల్ అయితే శరీరంనుంచి అదనపు ఫ్లూయిడ్స్ అనేవి తొలగిపోవు. ఇవి శరీరంలో పేరుకుపోతాయి. అందువలన, కాళ్ళలో, చేతులలో, చీలమండలలో వాపులు కనిపించవచ్చు.


రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోవడం వలన తీవ్రమైన దురదకు దారితీస్తాయి. ఇటువంటి లక్షణాలను మీరు గమనిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి..కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, తరచూ యురినేట్ చేస్తారు..లేదా యురినేట్ చేయడానికి ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: