నిత్య జీవితంలో యోగా - ఆరోగ్యయోగం


భారతఖండం లేదా నాటి ఆర్యావర్తమనే జంబూద్వీపంలో వివిధ శాఖలకు చెందిన జ్ఞానులు 'యోగాసనాలను సాధన చేసి, సాధన వలన కలిగే ప్రయోజనాలు ప్రాముఖ్యత ల గురించి ప్రచారం చేసారు. కానీ, వీరు ఆవిష్కరించిన ఙ్జాన విజ్ఞానములను సాధనల ద్వారా వినియోగంలోకి తెచ్చారేకాని ఎక్కడ పొందు పరచబడలేదు. ఇవి ముఖతః నేర్చుకోలని వారు భావించటమే దీనికి కారణం కావచ్చు. వారి శిష్యుల ద్వారా తరతరాలకు ప్రాచుర్యంలోకి తెచ్చారు. మొదటిసారి పొందు పరచిన లెక్కల ప్రకారం, మహర్షి పతంజలి అనే మహా పురుషుడికే  ఈ ఘనత దక్కింది. ఇతడు, యోగా గురించి కొన్ని సూత్రాలను, తత్వాలను, విధి-విధానాలను రచించి, నిపుణుల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు.


యోగాసనాలను నేర్పించే అనేక పాఠశాలలు ఇప్పుడు ఉన్నాయి, అయినప్పటికీ, పతంజలి వంటి మహా పురుషులు రచించిన ప్రాథమిక సూత్రాల ద్వారా అందించబడ్ద యోగాసనాలను మాత్రమె అనుసరిస్తున్నారు. హిందూ, బౌద్ధ, జైన మతంతో పాటు యోగా కూడా ఒక సాంప్రదాయ ఆరోగ్య విధానం, ఆరోగ్య నియంత్రణ పద్దతిగా ఎదిగింది.


యోగా వలన కలిగే ప్రయోజనాలు

యోగా వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమె కాకుండా, అనేక వ్యాధులు మన దరిచేరవు ఒక వేళ వ్యాధి పీడితులను శక్తివంతంగా ఆరోగ్యవంతులను చేసేస్తాయి.  యోగాసనాలతో దేహంలోని క్రొవ్వును కరిగించి దేహాన్ని క్రమ రూపంగా ఒక క్రమపద్దతిలో ఫిట్-గా ఉంచటం అతిసులభం.  సౌందర్యాన్ని ఇనుమడింప జేసుకోవచ్చు. 


అధిక రక్త పీడనం (high blood pressure):  వివిధ రకాల మందులను వాడటం కన్నా, యోగాసనాలను రోజు అనుసరించటం వలన ఒత్తిడితో పాటూ రక్త పీడనం కూడా తగ్గుతుందని చాలా రకాల పరిశోధన లలో నిరూపించబడింది. రక్త పీడనం ప్రారంభమయ్యే దశలలో, రోజు యోగాను అనుసరించటం వలన వాటి స్థాయిలు తగ్గించబడతాయి. యోగా అనుసరణ వలన శరీరంలో సిరలు విశ్రాంతి చెందించబడి, వాటికి బలం చేకుర్చి, రక్త పీడన స్థాయిలు తగ్గించబడతాయి. కావున రోజు యోగాను అనుసరించటం ప్రారంభించండి.


మధుమేహం (sugar): మధుమేహ వ్యాధిగ్రస్తులు యోగాసనాలను అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. రోజు ఉదయానే యోగాసనాలను చేయటం ద్వారా, శరీర రక్తంలో ఉండే గ్లూకోస్ (చక్కెర) స్థాయిలు తగ్గించబడతాయి. వీటితో పాటుగా ఆహార ప్రణాలికలను పాటించటం మంచిది.


గుండె ఆరోగ్యం (cardiac health): యోగాసనాలను రోజు అనుసరించటం వలన, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పరిశోధనలలో వెల్లడించబడింది. హృదయ స్పందనలు రక్త పీడనంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. యోగా వలన హృదయ స్పందన రేటు, రక్త పీడనం, రక్తం లో చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడతాయి.


ఇతర ప్రయోజనాలు: యోగా వలన చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు, ముఖ్యంగా శక్తి  స్థాయిలు పెరగటం, జ్ఞాపక శక్తిలో మెరుగుదల, వయసు మీరిన కొలది జరిగే మార్పులు ఆలస్యం గా బహిర్గతం అవటం మరియు వెన్నునొప్పి సమస్యల నుండి ఉపశమనం, ఇస్నోమ్నియా, కీళ్ళ నోప్పుల నుండి ఉపశమనం మరియు ఆస్తమా వంటి వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారు.


"యోగా" అనే సంస్కృత పదం అర్థం "ఐక్యం-ఏకం". ఐక్యం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ యోగా వైద్య శాస్త్ర ప్రకారం, "మనసుతో శరీరాన్ని మిళితం చెందించి చివరకి ఆత్మకు చేరువ అవ్వటం" అంటే మనసు దేహతో ఏకం లెదా ఐఖ్యం అవటం అని అర్ధం. ధ్యానం వంటి కొన్ని ఇతర ఆధ్యాత్మిక పద్దతులను అనుసరించి, సామాజిక  విధుల నిర్వహణ ద్వారా ఆహాన్ని దూరం చేసుకునే ప్రాచీన, ఆధ్యాత్మిక పధ్ధతులుగా చెప్పవచ్చు.


ఈ పద్దతులు ప్రాచీనం, సనాతనం అయినప్పటికీ, జ్ఞానులు వీటి చరిత్ర గురించి గ్రంథములలో రాస్తూ, దీని ఉనికిని ప్రపంచానికి తెలియజేశారు. రెండు వేల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న మునుల ద్వారా ప్రాచుర్యం పొందిన "యోగా దాని సాధన" మరియు ప్రాముఖ్యతల గురించి ముందే పలు యోగ గ్రంధాలలో పొందుపరిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: