ఒక ముక్కలో యోగా (ఙ్జానం ఇన్ నట్-షల్)

యోగా మహోత్సవదిన శుభాకాంక్షలు

యోగా అనేది 5౦౦౦సంవత్సరాల నుండి భారతదేశంలోఉన్నజ్ఞానము యొక్కఅంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలం కొన్ని శారీరక కదలికలు (ఆసనాలు} ఇంకా శ్వాస ప్రక్రియ (శ్వాస మీద ధ్యాస) అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తిల దేహ, మేధ, అత్మ అనుసంధానం లేక “ఆధ్యాత్మిక అనుసంధానం” అంటే బోడీ, మైండ్, సోల్ మూడింటిని సింక్రనైజ్ చేసే గొప్ప ప్రక్రియ.


విజ్ఞానశాస్త్ర ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవన సార విధానము. దీనిలోజ్ఞాన యోగము (తత్వశాస్త్రము), భక్తి యోగము , రాజ యోగము మరియు కర్మ యోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైన చెప్పిన యోగాలన్నిటి లో సమతౌల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకువస్తాయి.


శ్రీశ్రీ యోగా: శ్రీ శ్రీ రవిశంకర్ పండితులు రూపొందించిన ప్రక్రియ

శ్రీశ్రీ యోగా అనేది 3నుండి 5రోజుల వ్యవధితో జరిగే 10గంటల కార్యక్రమము.  శ్రీశ్రీ యోగా అనేది ఆరోగ్యకరమైన శక్తిని పుంజుకునే ఆనందకరమైన అనుభూతి. ఇది సులభమైన మరియు కష్టతరమైన శ్వాసప్రక్రియతో కూడుకున్నటువంటి ప్రక్రియ. దీని ద్వారా శారీరక, మానసిక సమతౌల్యం ఏర్పడుతుంది. ఇది ఒక బహుముఖ ప్రఙ్జ పాటవాన్నికలిగించే కార్యక్రమము.


ఇందులో యోగాసనాలు, శ్వాస ప్రక్రియ, యోగాకి సంబంధించిన జ్ఞానము, ఇంకా ధ్యానము పొందు పరిచబడి ఉంటాయి. ఇది నేర్చుకునే విద్యార్థులకు తమను తాము ఇంటి వద్దనే చేసుకోవచ్చు. ఇది శ్రోతగా నేర్చుకునే వారికి, రోజు సాధన చేసుకునే వారికీ అన్నిరకముల వయసుల వారికి ఉపయోగ పడుతుంది. చేసే వారి జీవన విధానములో ఎన్నో గొప్ప మార్పులు చోటు చేసు కున్నాయి.

 

దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడ్డారు. ఇంకొందరికి ఇతరులతో మసలుకొనే విధానంలో మార్పులు వచ్చాయి. నెర్చుకునే వ్యక్తులు వారి అనుభూతులని వివరించారు. వారు ఎంతో సంతోషంగా, ఆతృత తగ్గి, ఓర్పు పెరిగి, కుశల బుద్ధి కలిగి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని శ్రీశ్రీ యోగాతో పొందారు. సుదర్శన క్రియ ద్వారా దేహం మనసు ఆత్మలు ఐఖ్యం పొంది అదోరకమైన ఆత్మానంద ప్రక్రియ అనుభూతిని పొందవచ్చు.

 

యోగా ఒక జీవన విధానంగా మార్చుకోవాలి

ఈ యోగాలో ఉన్న అందమేమిటంటే యోగాసనాలు శరీరానికి ధృడత్వాన్ని, శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైన, చిన్నవారైన, ధృడంగా ఉన్నవారైన, లేనివారైన ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు. సాధచేస్తున్న కొద్ది ఆసనాల వెనకాల ఉన్న అంతరార్ధం బాగా అవగాహనకు వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్య శారీరక క్రమము నుంచి అంతరంగిక పరివర్తన అనుభూతిలోకి అనుభవంలోకి వస్తుంది. యోగ మన జీవితంలోని అంతర్భాగమే కానీ అన్యభాగము కాదు.


యోగ పుట్టిన దగర నుంచి చేస్తున్న ప్రక్రియే. పసిపిల్లల్ని చుస్తున్నట్లు వారు రోజు మకరాసనం, పవనముక్తసనం ఎన్నోసార్లు వేస్తూనే వుంటారు. యోగ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్కరు యోగా “మా జీవన విధానం” అని ధృడంగా నమ్మేలాగా ఆవిష్కృతం చేయడం లక్ష్యం గా నిర్దేశించుకోవాలి.

 

 ఆయుర్వేదమే ఆరోగ్యవేదం  

ఆయుర్వేద మనేది ప్రపంచంలో సున్నితమైన, శక్తివంతమైన, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య విధానము. కేవలం అనారోగ్యానికి  చికిత్సని ఇవ్వడమే కాకుండా ఆయుర్వేద అనేది జీవన ఆరోగ్యంకోసం అవలంభించవలసిన ఆరోగ్య విఙ్జానం విధానం.  ఇది ప్రకృతిలో మిళితమైనటువంటి సూత్రాలను పాటిస్తూ మానవుని యొక్క శరీరము, మనస్సు, అంతఃశ్శక్తిని ప్రకృతిలో ఉన్నట్లుగానే సమతౌల్యానికి తీసుకువస్తుంది. ఆయుర్వేద వాడకం యోగ సాధనని కూడా అభివృద్ధి చేస్తుంది. ఈ రెండు సరైన గెలుపుని లభింపజేస్తాయి. ఈ అరోగ్యవేదంలో విస్తృతంగా ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్య జీవన విధానానికి కావలసిన సూచనలు చెప్పబడతాయి.


శ్వాస ప్రక్రియ  (ప్రాణాయామము)  మరియు ధ్యానము శ్వాస మీద ద్యాస 

ప్రాణాయామము అనగా ఒకరి శ్వాస మీద పట్టు సాధించడం. ఇంకా శ్వాసను పీల్చేశక్తిని పెంచడం. సరైన శ్వాస ప్రక్రియ శరీరం లోని అధిక ప్రాణవాయువును రక్తంలోనికి, మెదడులోనికి ప్రసరింపచేసి ప్రాణశక్తిని పెంపొందిస్తుంది. ప్రాణాయామము అనేక యోగాసనాలు వేయటానికి దోహదపడుతుంది. ఈ రెండింటి సమ్మేళనము ప్రాణాయామము, యోగాసనాలు శరీరము,  మనస్సు, ఆత్మకు స్వత్చతను, వ్యక్తి గత అనుశాసనాన్ని ఇస్తాయి. ప్రాణాయామము యొక్క మెళకువ మనలను లోతైన లేదా ఘాఢమైన ధ్యానములోనికి తీసుకువెళుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: