చరిత్రలో ఈరోజు : జనవరి 6న ఏం జరిగిందంటే.?

praveen

చరిత్రలో జనవరి 6న ఎన్నో జననాలు...  ఎన్నో సంచలన సంఘటనలు... మరెన్నో మరణాలు  జరిగాయి. అసలు జనవరి 6వ తేదీన చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 

 మదర్ తెరిసా : 1929 జనవరి 6వ తేదీన మదర్ తెరిసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమాలు మొదలు పెట్టారు. మదర్ తెరాస మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు 45 సంవత్సరాల పాటు కొనసాగాయి. 

 

 

 భారత విభజన అంగీకారం : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారత విభజనను అంగీకరించింది విభజనకు అనుకూలంగా 99 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 52 ఓట్లు వచ్చాయి దీంతో భారతదేశ విభజన

 అనివార్యం అయింది. 1947 జనవరి 6వ తేదీన ఇది జరిగింది.

 

బంగ్లాదేశ్ ప్రధాని : 2009 జనవరి ఆరవ తేదీన బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం చేశారు. 

 

 కపిల్ దేవ్ జననం  : ప్రముఖ భారత దిగ్గజ క్రికెt1 ఆటగాడు కపిల్ దేవ్. ఇండియన్ జట్టుకు అందని ద్రాక్షగా  ఉన్న ప్రపంచకప్ను మొదటిసారి అందించిన గొప్ప సారథి. కపిల్ దేవ్ సారథ్యంలోని మొదటిసారి ఇండియన్ జట్టు ప్రపంచ కప్ ను  సొంతం చేసుకుంది. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడి కపిల్ దేవ్ ఇండియన్ జట్టుకు ఎన్నో విజయాలను సొంతం చేసాడు. జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరిస్తూ జట్టుకు సారథ్యం వహిస్తు  జట్టును ముందుకు నడిపించడంలో విజయవంతం అయ్యాడు కపిల్ దేవ్. ఎన్నో రికార్డులను సైతం నెలకొల్పి ఇప్పటికీ ఎంతో మంది ఆటగాళ్లకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. కాగా కపిల్ దేవ్  1959 జనవరి 6వ తేదీన జన్మించారు. కపిల్ దేవ్ భారతదేశపు అత్యంత గొప్ప ఆల్ రౌండర్ గా రికార్డు సృష్టించాడు. 

 

 

 ఏ ఆర్ రెహమాన్ : భారతదేశంలోని అత్యంత పేరుగాంచిన సంగీత దర్శకుల్లో ఒకరు ఏ ఆర్ రెహమాన్. ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్. స్వరకర్త గాయకుడు గేయ  రచయిత నిర్మాత సంగీతకారుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ.ఆర్.రెహమాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఏ.ఆర్.రెహమాన్ 1966 జనవరి 6వ తేదీన జన్మించారు. ఆయన  సంగీతానికి గాను జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు ఏ ఆర్ రెహమాన్. ఏదైనా సినిమాలో ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంది అని ప్రేక్షకులు అందరూ భావిస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన పాటలను కంపోజ్ చేసి ప్రేక్షకులందరికీ అందించాడు. వివిధ భాషల్లో ఏ.ఆర్.రెహమాన్ ప్రసిద్ధమైన గాయకుడిగా కొనసాగుతున్నాడు. 

 

 

 పద్మ దేవేందర్ రెడ్డి : మెదక్ జిల్లా ఎమ్మెల్యే గా పద్మాదేవేందర్రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. గతంలో తెలంగాణ  అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 జనవరి 6వ తేదీన పద్మాదేవేందర్రెడ్డి జన్మించారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యేగా  రెండోసారి గెలిచి  తన సత్తా చాటారు.

 

 

 వందేమాతరం శ్రీనివాస్ : ప్రముఖ రచయిత దర్శకుడు నిర్మాత గాయకుడు అయిన వందేమాతరం శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు కొసమెరుపు. వందేమాతరం శ్రీనివాస్ ఎన్నో సినిమాల్లో నటించడమే కాకుండా తెలుగు సినిమాల్లోని దర్శకత్వం కూడా వహించారు. అంతేకాకుండా ఎన్నో సినిమాలు విలక్షణమైన పాత్రల్లో నటించి తన సత్తా చాటారు వందేమాతరం. వందేమాతరం శ్రీనివాస్ అంటే ఫోక్ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఇకపోతే అయినా 1966 జనవరి 6వ తేదీన జన్మించారు.

 

 త్యాగయ్య మరణం : సుప్రసిద్ధ కళాకారుడు ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య 1967లో జన్మించారు. త్యాగయ్య ఎన్నో రచనలని గేయాలను అందించారు. 1847 జనవరి 6వ తేదీన త్యాగయ్య మరణించారు. 

 

 లూయీ బ్రెయిలీ మరణం : ఫ్రెంచ్  విద్యావేత్త అంధుల లిపి సృష్టికర్తలు లూయి బ్రెయిలీ  ఏప్రిల్ 1852 జనవరి 6వ తేదీన. మరణించారు . అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ ఇప్పటికే అందులు  లూయీ బ్రెయిలీ ప్రవేశపెట్టిన బ్రెయిలీ లిపి లోనే చదువుకుంటూన్నారు. 

 

 

 ఉదయ్ కిరణ్ మరణం : తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ఉదయ్ కిరణ్ ఎన్నో సినిమాల్లో నటించి మరెన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే యువ కథానాయకుడు అయినప్పటికీ స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులతో తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో  కూడా ఎన్నో చిత్రాలను నిర్మించారు ఉదయ్ కిరణ్. ఈ  హీరోగా నటించిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో హ్యాట్రిక్ హీరో  అనే పేరు సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: