చరిత్రలో ఈరోజు : జనవరి 18 న జరిగిన సంఘటనలు ఇవే..?

praveen

జనవరి 18వ తేదీన చరిత్రలో ఎన్నో  సంఘటనలు జరిగాయి. ఎంతో  మంది జననాలు ఇంకెంతో మంది మరణాలు కూడా జరిగాయి. కాగా  ఒక్కసారి  చరిత్రలోకి తొంగిచూస్తే అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి. 

 

 ఎక్స్ కిరణాలు : ఎక్స్ కిరణాలు ఉత్పత్తి చేసే యంత్రాన్ని మొదటిసారి హేఎల్ స్మిత్  ద్వారా ప్రదర్శించబడింది. ఈ ఘటన 1896 జనవరి 18వ తేదీన జరిగింది.. 

 

 భారత పార్లమెంట్ భవనం ప్రారంభం : 1927 జనవరి 18వ తేదీన భారత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. లోక్ సభ రాజ్యసభ లతో కూడిన పార్లమెంటును ప్రారంభించారు. ఈ పార్లమెంటు భవనం భారతదేశం రాజధాని ఢిల్లీలోని సంసాద్ మార్గ్ లో  కలదు. 

 

 

 నాళం కృష్ణారావు జననం : సంఘ సంస్కర్త.. బాల సాహిత్య బ్రహ్మ అయిన  నాళం కృష్ణారావు.. 1881 జనవరి 18వ తేదీన జన్మించారు. గ్రంధాలయ స్థాపకుడు... పత్రికా సంపాదకులు... అంతేకాకుండా స్వతంత్ర ఉద్యమంలో కూడా... ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమరయోధులు. మానవ సేవ పత్రిక సంపాదకులు నాళం కృష్ణారావు. 

 

 

 సుందరం బాలచందర్ జననం  సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు అయిన సుందరం బాలచందర్ 1922 జనవరి 18వ తేదీన జన్మించారు. పలు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు... సినిమాల్లో నటుడిగా కూడా సినీ ప్రేక్షకులకు కొసమెరుపు. సుందరం బాలచందర్ సుప్రసిద్ధ వీణ విధ్వాంసుడు. దక్షిణ భారతదేశానికి చెందిన దర్శకుడు ఈయన. 1956 సంవత్సరంలో ఈయన తెలుగులో దర్శకత్వం వహించిన... ఏది నిజం సినిమా... రాష్ట్రపతి ప్రశంసాపత్రం అందుకున్నది.

 

 వీరప్పన్ జననం : భారతదేశానికి చెందిన పేరుమోసిన బందిపోటు అయిన  వీరప్పన్  గంధపు చెట్లు.. ఏనుగు దంతాలు స్మగ్లింగ్  చేయడంలో సుప్రసిద్ధుడు.ఈయన  1952 జనవరి 18వ తేదీన జన్మించారు. కాగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో ఏనుగు దంతాలు గంధపు చెట్లను స్మగ్లింగ్ చేసిన బందిపోటు వీరప్పన్. భారతదేశంలోని ప్రతి ఒక్కరికి వీరప్పన్ కొసమెరుపు. స్మగ్లింగ్ తో పాటు ఎంతో మంది ని కిడ్నాప్ చేయడం చంపడం లాంటివి కూడా చేశాడు వీరప్పన్ . ఎంతో మంది రాష్ట్ర క్యాడర్ కు  సంబంధించిన వాళ్ళని కూడా హత్య చేశాడు. కాగా  వీరప్పన్  2004 సంవత్సరంలో చనిపోయారు. 

 

 వినోద్ కాంబ్లీ జననం : ప్రముఖ భారత మాజీ క్రీడాకారుడు వినోద్ కాంబ్లీ 1972 జనవరి 18వ తేదీన జన్మించారు. ఈయన  భారత జట్టులో చాలాకాలం పాటు కొనసాగారు. తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో క్రికెట్ ప్రేక్షకులను అలరించారు వినోద్ కాంబ్లీ. 

 

 

 డేవిడ్ మైకేల్ బటిస్టా జననం  : ప్రముఖ రెస్లింగ్  క్రీడాకారుడు డేవిడ్  మైకేల్ బటిస్టా . 1969 జనవరి 18వ తేదీన జన్మించారు డేవిడ్ బటిస్టా . ప్రస్తుతం ప్రొఫెషనల్ రెస్లింగ్  క్రీడాకారుడిగా రిటైర్మెంట్ పొందాడు. ఈయన ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తన అద్భుతమైన యాక్షన్ తో అతడు కొట్టేవాడు బటిస్టా . వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ లో.. ఎన్నో రోజుల పాటు ప్రొఫెషనల్ రెస్లర్ గా  ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ రెస్లింగ్ అంటే  ఇష్టపడే వాళ్ళు చాలామంది. బటిస్టా  వస్తున్నాడంటే రెస్లింగ్ ని  ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. 1999 సంవత్సరంలో బటిస్టా రెస్లింగ్  వృత్తిని మొదలుపెట్టాడు. 

 

 నందమూరి తారక రామారావు మరణం : తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ ఎల్లలు దాటేల చేసిన  గొప్ప నటుడు నందమూరి తారక రామారావు. దేవుడు అంటే ఇలానే ఉంటాడేమో అని రాముడు కృష్ణుడు వేషాల్లో  ప్రేక్షకులను అలరించిన గొప్ప వ్యక్తి. తన చరిష్మాతో ఎంతో మంది తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి కొన్ని దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు నందమూరి తారక రామారావు. ఇక ఆ తర్వాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పోయాక మనస్థాపంతో మరణించారు. 1923 లో జన్మించిన నందమూరి తారకరామారావు 1996 జనవరి 18వ తేదీన మరణించారు. 

 

 హరి వంశ రాయ్ బచ్చన్ మరణం : బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని  బాలీవుడ్  మెగాస్టార్ గా ఎదిగిన  అమితాబచ్చన్ తండ్రి హరి వంశ రాయ్ బచ్చన్ 2003 జనవరి 18వ తేదీన మరణించారు. ఈయన ప్రముఖ హిందీ కవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: