చరిత్రలో ఈరోజు : హిస్టరీ లో ఈరోజున ఏం జరిగిందో తెలుసా..?
ఫిబ్రవరి 5వ తేదీన చరిత్రలో ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి హిస్టరీ లోకి వెళ్లి చూసి నేడు ఏం జరిగింది ఎలాంటి సంఘటనలు జరిగాయి తెలుసుకుందాం రండి.
సచిన్ టెండూల్కర్ రికార్డ్ : క్రికెట్ దేవుడిగా పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డును అధిగమించాడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం యువ క్రికెటర్లు అందరికీ సచిన్ టెండూల్కర్ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటాడు.కాగా 2008 ఫిబ్రవరి 5వ తేదీన సచిన్ టెండూల్కర్ 16 వేల పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
గరికపాటి రాజారావు జననం : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు నాటకరంగ ప్రముఖుడు గరికపాటి రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. ఈయన ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. ఈయన స్థాపించిన నాటక సంఘం ద్వారా అనేక మంది ప్రతిభావంతులైన కళాకారులు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. వీరీలో చెప్పుకోదగ్గ వారూ అల్లు రామలింగయ్య, దేవిక ఉన్నారు.. ఈయన చిన్నప్పటినుంచి హరికథలు వేస్తూ నాటక రంగం పై ఎంతో ఆసక్తిని పెంచుకున్నారు. చిన్నప్పుడు హరికథలు పలు నాటకాలు వేస్తూ ఎంతోమందిని మెప్పించారు గరికపాటి రాజారావు. ఇక ఆ తర్వాత దర్శకత్వంపై ఎంతో ఆసక్తి కనబరిచిన గరికపాటి రాజారావు... దర్శకత్వం లో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనం సృష్టించింది. షాజహాన్ కా ఎస్వి సాంబశివరావు.. ఎంతో అద్భుతంగా నటించారు. ఇక పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా పోషించాడు గరికపాటి.ఈయన 1953 సెప్టెంబర్ 8న మద్రాసులో మరణించారు.
షేక్ నాజర్ జననం : బుర్రకథ పితామహుడుగా పిలుచుకునే షేక్ నాజర్ 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. గొప్ప బుర్రకథ కళాకారుడు నటుడు ప్రజా రచయిత ఈయన . గాయకుడుగా కూడా ఎన్నో పాటలు పాడాడు. పాఠశాల స్థాయి నుంచే బుర్ర కథలు ఎంతో ఆసక్తి కనబరిచారు ఈయన . జానపద కళారూపాలైన బుర్రకథ కొత్త జీవం పోశారు. బుర్రకథకు ఎన్నో మెరుగులు దిద్ది ప్రత్యేక ఆహారంలో తగిన హావభావాలతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి బుర్రకథ ప్రక్రియకు విస్తృత ప్రచారం చేశారు షేక్ నాజర్. బుర్రకథ పితామహుడుగా షేక్ నాజర్ పేరుగాంచాడు. ఇక పలు సినిమాల్లో కూడా నటించారు. ఇక ఆయనకు ఎన్నో సన్మానాలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో షేక్ నాజర్ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత నాలుగు దశాబ్దాల పాటు కొనసాగింది.
ఏసీ జోష్ జననం : ప్రముఖ రాజకీయ నాయకుడైనా ఎసి జోష్ .. 1937 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదిగి ఎన్నో పదవులు చేపట్టారు. పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో తన గొంతు వినిపించిన ఏసీ జోష్ మాజీ కేరళ శాసనసభ స్పీకర్ కూడా సేవలందించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అంతేకాకుండా వీక్షణం డైలీ పత్రిక ప్రధాన సంపాదకులు కూడా పనిచేశారు ఏసీ జోస్ . గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏసీ జోష్ ... చికిత్స పొందుతూ జనవరి 24 2016 లో మృతి చెందారు.
వట్టికోట అల్వారూస్వామి మరణం : ప్రముఖ రచయిత ఆయన వట్టికోట ఆళ్వారుస్వామి 1961 ఫిబ్రవరి 5వ తేదీన మరణించారు. తెలంగాణ సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. ఈయన ఒక కమ్యూనిస్టు నేత ఉద్యమకర్త ప్రచురణ కర్త పాత్రికేయుడు గా కూడా పని చేశారు. బాలసాహిత్య దగ్గర్నుంచి పౌరహక్కుల వట్టికోట ఆళ్వారుస్వామి ఉద్యమాన్ని చేపట్టారు.