చరిత్రలో ఈరోజు : 25-03-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?
మార్చి 25వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
పాకిస్తాన్ ప్రధానమంత్రి : పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణ స్వీకరం చేశారు.
నార్మన్ బోర్లాగ్ జననం : హరిత విప్లవ పితామహుడు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన నార్మన్ బోర్లాగ్ 1914 మార్చి 28 వ తేదీన అమెరికాలోని ఉపయోగాలు జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నార్మన్ బోర్లాగ్ వ్యవసాయ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచ వ్యాప్తంగా వందలాది కోట్ల మందిని ఆకలి బాధలు నుంచి కరువు నుండి రక్షించారు. అయితే నార్మన్ బోర్లాగ్ కి ఉన్న 106 ఎకరం పొలం పై 7ఏళ్ల నుంచి తొమ్మిది ఏళ్ళ వరకు పొలం పని చేపలు పట్టడం వేటాడటం పశువుల తో కాలక్షేపం ఆటపాటలతో గడిపాడు నార్మన్ బోర్లాగ్. ఆ తర్వాత మిన్నెసోట విశ్వవిద్యాలయంలో అటవీ శాస్త్రంలో పట్టా పొంది ఉద్యోగంలో చేరారు. జన్యు శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. అయితే ఈయన దృష్టి గోధుమ పంట మీద పడడం ప్రపంచానికి ఎంతో మేలు చేసింది. చీడ పీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే కొత్తరకం వంగడాలను కనిపెట్టడం ద్వారా సంచలనం సృష్టించారు నార్మన్ బోర్లాగ్. 1960 ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో ఈ వంగడాలను పరిచయం చేయబడింది ఎంతోమందికి ఆకలి పస్తు లేకుండా చేశాడు. ఆయన ఆవిష్కరణ వల్ల 1980-1990 మధ్య కాలంలో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా రెండింతలు పెరిగి పోయాయి. ఇక అదే క్రమక్రమంగా హరిత విప్లవం గా మారిపోయింది. ఆసియా ఆఫ్రికా ప్రాంతాల్లో సైతం కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు. ఈ నేపథ్యంలో బోర్లాగ్ కనిపెట్టిన గోధుమ వంగడాల కు ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు. ఇక ఆహార పంటల కొరతను తీర్చినందుకుగాను 1970లో ఈయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
పి షణ్ముఖం జననం : పాండిచ్చేరి రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పి షణ్ముఖం 1927 మార్చి 25 వ తేదీన జన్మించారు. ఈయన ముఖ్యమంత్రిగానే కాకుండా పలు మంత్రి పదవులు అలంకరించారు. 2013 సంవత్సరంలో పరమపదించారు.
వసంత్ గోవారికర్ జననం : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన వసంత్ గోవారికర్ 1933 మార్చి 27వ తేదీన జన్మించారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో సంస్థకు చీప్ గా కూడా సేవలందించారు. భారతదేశంలో సైన్స్ టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా 1991 -93 మధ్యకాలంలో అప్పటి భారత ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు . వసంత గోవారికర్ అంతరిక్ష రంగంలో విశేష పరిశోధనలు చేశారు. భారత ఖ్యాతిని ఎంతగానో పెంచారు. వాతావరణం, జనాభా రంగంలో ఆయన అందించిన సేవలకు గాను భారత మాన్సూన్ నమూనా పితామహుడిగా పేరుగాంచాడు. తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో వాతావరణ మార్పులపై శోధించు వార్తలు రూపొందించిన తొలి శాస్త్రవేత్త గోవారికర్. ఈయన అంతరిక్ష పరిశోధన, వాతావరణ అంచనా మొదలగు అంశాలపై పరిశోధనలు చేశారు. అయితే 1979 నుంచి 85 మధ్యకాలంలో ఇస్రో లో పనిచేసిన వసంత గోవారికర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా నిర్వహించారు. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు కూడా దక్కాయి
శ్రీరామోజు హరగోపాల్ జననం : ప్రముఖ కవి రచయిత ఉపాధ్యాయుడు చరిత్ర పరిశోధకుడు అయిన శ్రీరామోజు హరగోపాల్ 1957 మార్చి 25వ తేదీన నల్గొండ జిల్లాలో జన్మించారు. ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయినా తర్వాత ఉద్యమాలలో క్రియాశీలంగా పనిచేశారు. అనేక సాహిత్య సంస్థలతో కలిసి పనిచేసిన వ్యక్తి శ్రీరామోజు హరగోపాల్. ఈయన రాసిన కవిత్వాలు 1991లో మట్టి పుట్టిల్లు ఇలాంటి కవితాసంపుటిగా ప్రచురించారు. ఈయన రచనా సాహితీ కళా వేదిక అనే సాహిత్య సంస్థని స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక అనేక పుస్తకాలను సంస్థ తరఫున ప్రచురించాడు శ్రీరామోజు హరగోపాల్.
మణికొండ చలపతిరావు మరణం : సుప్రసిద్ధ పత్రికా రచయిత సంపాదకుడు సాహితీవేత్త మానవతావాది అయినా మానికొండ చలపతిరావు 1983 మార్చి 25వ తేదీన మరణించారు.