చరిత్రలో ఈరోజు :30-05-2020 రోజున ఏం జరిగిందంటే..?
మే 30 వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి హిస్టరీ లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి.
ఎర్రగుడిపాడు వరదరావు జననం : తెలుగు సినిమా దర్శకుడు నిర్మాత నటుడు అయిన ఎర్ర గుడిపాటి వరద రావు 1903 మే 30 వ తేదీన జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో బొంబాయి వెళ్ళాడు ఈయన. ముందుగా మూకీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని పొందాడు. ఇక ఆ తర్వాత 1939లో సొంత చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించారు ఎర్రగుడి పాటి వరదరావు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏడు భాషల చిత్రాల్లో పని చేసిన ఘనత కేవలం ఎర్రగుడిపాటికే దక్కింది. ఇక ఎన్నో సినిమాల్లో నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించడమే కాదు నిర్మాతగా కూడా విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగించారు ఎర్రగుడిపాటి వరదరావు.
అల్లు శిరీష్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో అయిన అల్లుశిరీష్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. అల్లు అర్జున్ సోదరుడు అల్లు అరవింద్ అబ్బాయి అయినా అల్లు శిరీష్ 1987 మే 30 వ తేదీన జన్మించారు. సురేష్ రాధా మోహన్ దర్శకత్వం వహించిన గౌరవం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అంతకు ముందుగా భానుమతి దర్శకత్వం వహించిన తమిళ సీరియల్ లో కూడా అల్లుశిరీష్ బాలనటుడిగా నటించారు. అల్లు శిరీష్ కు అనేక పెద్ద బ్యానర్ల నుండి చిత్రాలకు అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించాడు. కానీ కొన్ని చిత్రాలను చూసిన తర్వాత ఇతర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలనని ఆత్మవిశ్వాసం వచ్చి హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడు అల్లు శిరీష్. గౌరవం కొత్తజంట శ్రీరస్తు శుభమస్తు ఏబిసిడి అనే సినిమాల్లో నటించారు అల్లు శిరీష్.
పరేష్ రావల్ జననం : ప్రముఖ భారతీయ నటుడు అయిన పరేష్ రావల్ 1950 మే 30 వ తేదీన జన్మించారు. ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ఉంటారు పరేష్ రావల్ . వివిధ భాషల్లో తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడు. కొన్ని సినిమాల్లో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఈయన .
కె.ఎస్.రవికుమార్ జననం : ప్రముఖ భారతీయ దర్శకుడు మరియు నటుడు అయిన కె.ఎస్.రవికుమార్ 1957 మే 30 వ తేదీన జన్మించారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో కె.ఎస్.రవికుమార్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తమిళం లో ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు కె.ఎస్.రవికుమార్. ముఖ్యంగా యాక్షన్ త్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో కె.ఎస్.రవికుమార్ ఆయనకు ఆయనే సాటి. కమల్ హాసన్ తో 2008లో దశావతారం అనే సినిమాను తెరకెక్కించింది కె.ఎస్.రవికుమారే . ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలను తెరకెక్కించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
గోపీసుందర్ జననం : ప్రముఖ సంగీత దర్శకుడు అయిన గోపీసుందర్ సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఈయనకు తమిళ మలయాళ ఇండస్ట్రీలో గోపీసుందర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించారు గోపి సుందర్ . తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలకు మ్యూజిక్ అందించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
దాసరి నారాయణ రావు మరణం : తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా నిర్మాతగా నటుడిగా ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన దాసరి నారాయణరావు తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సుపరిచితుడే . దాసరి నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక అధ్యాయం అని చెప్పుకోవచ్చు. 1947 మే 4వ తేదీన జన్మించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డు సైతం సృష్టించారు . నూట యాభై చిత్రాలు దర్శకుడిగా 53 సినిమాలకు నిర్మాతగా 250 కి పైగా చిత్రాలకు సంభాషణలు రచయితగా గీత రచయితగా పనిచేశారు దాసరి నారాయణరావు. దాసరి నారాయణ రావుకు దర్శక రత్న అనే బిరుదు కూడా ఉంది. ఎంతోమంది నేటి తరం దర్శకులకు దాసరి నారాయణరావు ఒక ఆదర్శం. ఈయన 2017 మే 31 తేదీన పరమపదించారు.