సెప్టెంబ‌ర్ 9వ తేదికి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 9వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు


1908 - ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై)


ప్ర‌ముఖుల జననాలు

1892: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (మ.1981)
1898: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1972)
1914: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (మ.2002)
1935: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (మ.2012)
1940: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020)
1953: సి.హెచ్. మల్లారెడ్డి, 16వ లోక్‌సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు.
1953: మంజుల భారతీయ సినీ నటీమణి. (మ.2013)
1961: సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు.
1963: లక్ష్మీ. టి, రంగస్థల నటి.
1987: తథాగత్ అవతార్ తులసి, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బాలమేధావి.


ప్ర‌ముఖుల మరణాలు


1952: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (జ.1910) తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు. నైజాం, ఆంధ్ర ప్రాంతాలలో ఇంజనీరుగా పనిచేశాడు. ప్రాణం కన్నా విధి నిర్వహణే మిన్నగా భావించి, ఆ విధి నిర్వహణలోనే ప్రాణాలు వదిలిన త్యాగమూర్తి.
1978: జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు. హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్ ఒకటి. (జ. 2 ఆగష్టు 1892)
2003: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1927). భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా పై ఆడిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ సిరీస్‌ను గెలిపించాడు. అదే కెప్టెన్‌గా అతని ఏకైక సిరీస్ కావడం గమనార్హం.


పండుగలు , జాతీయ దినాలు

తెలంగాణ భాషా దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: