అక్టోబ‌ర్ 11వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 11వ ‌తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1980: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు. టంగుటూరి అంజయ్య (ఆగష్టు 16, 1919 - అక్టోబరు 19, 1986), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. ఈయన 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంజయ్య 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లా, భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. అంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు. కాంగ్రెసు పార్టీ కి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభ కు ఎన్నికైనాడు.
1988: జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

ప్ర‌ముఖుల జననాలు

1827: అఫ్జల్ ఉద్దౌలా, హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు. (మ.1869). అఫ్జల్ ఉద్దౌలా - మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ (11 అక్టోబర్ 1827 - 26 ఫిబ్రవరి 1869) నాసిర్ ఉద్దౌలా కుమారుడు నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. ఇతడు హైదరాబాదును క్రీ.శ. 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు. అసఫ్ జహ హైదరాబాద్ రాబడి, న్యాయ వ్యవస్థలు సంస్కరించింది, ఒకపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> పోస్టల్ సర్వీస్ రూపొందించినవారు, మొదటి రైలు, టెలిగ్రాఫ్ నెట్వర్క్లు నిర్మించారు.
1902: జయప్రకాశ్‌ నారాయణ్, భారత్‌లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి. (మ.1979)
1942: అమితాబ్ బచ్చన్, సినిమా నటుడు.
1947: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013)
1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.
1972: సంజయ్ బంగర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

ప్ర‌ముఖుల మరణాలు

2015: మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937)

పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ బాలికల దినోత్సవం.
అంతర్జాతీయ పేపర్ బాయ్ దినం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: