అక్టోబ‌ర్ 14వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 14వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1912: హెచ్.సి.హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు
1956: నాగపూరులో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు.
1977: జ్యోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా నియామకం.
1985: అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది.
1994: బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు.
1998: అమర్త్యసేన్‌కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.

ప్ర‌ముఖుల జననాలు

1643: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (మ.1712)బహదూర్ షా (ఉర్దు:بہادر شاه اول) (జననం బుర్హన్‌పూర్ వద్ద అక్టోబర్ 14, 1643 - మరణం లాహోర్ వద్ద ఫిబ్రవరి 27, 1712) ముఘల్ చక్రవర్తులలో ఒకరు. భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో ఆయన 7వ చక్రవర్తి. ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని 1707 - 1712 వరకు పాలించాడు. ఆయన అసలు పేరు కుతుబ్ ఉద్-దీన్ ముహమ్మద్ మూ'ఆజం " తరువాత ఆయన తండ్రి " షా ఆలం " బిరుదు ఇచ్చాడు. 1707 లో ఆయన సింహాసం అధిష్టించిన తరువాత " బహదూర్ షా " బిరుదును స్వీకరించాడు. టర్కీ మంగోలు భాషకలో బహదూర్ అంటే సాహసవంతుడు అని అర్ధం. ఆయన 5 సంవత్సరాల కాలం మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆయన 63 సంవత్సరాల వయసులో సింహాసనన్ని అధిష్టించాడు.
1877: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (మ.1937)
1909: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు. (మ.1989)
1952: వేదగిరి రాంబాబు, రచయిత (మ.2018).
1981: గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

ప్ర‌ముఖుల మరణాలు

1969: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు. (జ.1886)
1982: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి. (జ.1897)
2004: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (జ.1920)
2011: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (జ.1932)
2013: టి.వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్, పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రాత వహించాడు.

పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: