న‌వంబ‌ర్ 8వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 8వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1947: జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది.
1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.


ప్ర‌ముఖుల జననాలు

1656: ఎడ్మండ్‌ హేలీ, హేలీ తోకచుక్కను కనుగొన్న హేలీ ఇంగ్లండులో హేగర్‌స్టన్‌లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742)
1884: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త (మ.1922).
1893: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు (మ.1964).
1896: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి (మ.1972).
1908: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006).
1917: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి (మ.2008).
1918: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త (మ.2007).
1927: krishna ADVANI' target='_blank' title='లాల్ కృష్ణ అద్వానీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
1936: ఎస్.గంగప్ప, తెలుగు రచయిత.ఎస్.గంగప్ప 1936, నవంబర్ నెల 8వ తేదీన నల్లగొండ్రాయని పల్లి లో వెంకటప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య సోమందేపల్లిలోను, మాధ్యమిక విద్యపెనుకొండలోను జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదివాడు. వాల్తేరుఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుండి 1960లో ఎం.ఏ. పూర్తిచేశాడు. కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా "కోలాచలం శ్రీనివాసరావు - నాటక సాహిత్య సమాలోచనము" అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించాడు. 1960లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి కాకినాడ, విశాఖపట్నం,హైదరాబాదు, కర్నూలుడిగ్రీ కళాశాల, కర్నూలు">సిల్వర్ జూబ్లీ కళాశాల లలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశాడు. 1978నుండి నాగార్జునాయూనివర్శిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1989-91లో తెలుగు ప్రాచ్యభాషాసంఘం అధ్యక్షుడిగా, 1994-96లో ఎం.ఏ పాఠ్యనిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవీవిరమణ చేశాడు. 
1969: ఎనుముల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, తరువాత కాంగ్రెస్ లో చేరాడు.
1986 : ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.
1979.విద్యావేత్త యాస వెంకట్ రెడ్డి

ప్ర‌ముఖుల మరణాలు

1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు (జ.1892).
1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు (జ.1908).
2013: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయనాయకుడు (జ.1957).


పండుగలు , జాతీయ దినాలు

వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే.
అంతర్జాతీయ రేడియాలజి దినం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: