న‌వంబ‌ర్ 26వ ‌తేదీకి చరిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం..విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 26వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1949: 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.
1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.
2008: ముంబై తీవ్రవాద దాడులు.

ప్ర‌ముఖుల జననాలు

1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995)
1965: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన రిడ్లీ జాకబ్స్ 31వ యేటా తొలి టెస్ట్ ఆడి తన ఆరేళ్ళ టెస్టు క్రీడా జీవితంలో మొత్తం 65 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తిచేసుకునాడు. వికెట్ కీపర్‌గా 65 టెస్టులలో 207 క్యాచ్‌లను వికెట్ల వెనుక పట్టుకున్నాడు. జెఫ్ డూజాన్ తరువాత ఈ ఘనత సాధించిన రెండో వెస్ట్‌ఇండీస్ వికెట్ కీపర్ గా రికార్డు సాధించాడు.

ప్ర‌ముఖుల మరణాలు

1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910).
1984: తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907).వీరు 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలు కు వెళ్ళారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించి దహనం చేసి మరలా రాయవెల్లూరు జైల్లో ఆరు నెలలు శిక్షను అనుభవించారు. వీరు భర్తతో కలిసి కావూరు లో వినయాశ్రమం స్థాపించారు. 1934 ఆయుర్వేద వైద్యశాల స్థాపించారు. పిల్లలకోసం గురుకుల పాఠశాల స్థాపించారు.1935లో మీరా బెన్ చేత స్వరాజ్య స్థూపం ఆవిష్కరింపజేశారు. 1939 నుండి చరఖా ప్రచారం చేశారు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948 లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకు దీక్షవహించారు.
1995: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).
1995: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు (జ.1915).
1997: మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).
2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926).
2008: "ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే
2008: ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే
2008: సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్


పండుగలు , జాతీయ దినాలు

జాతీయ న్యాయ దినోత్సవం
సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: