డిసెంబర్ 14వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా...?
ముఖ్య సంఘటనలు
2017 - ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గామి జలప్రవేశం.
ప్రముఖుల జననాలు
1914: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)
1923: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటకకర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది
1963: భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.
1982: ఆది పినిశెట్టి, తెలుగు మరియూ తమిళ నటుడు.
ప్రముఖుల మరణాలు
1799: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1732)
1915: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (జ.1842)
1965: జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, నవలా రచయిత, నాటకకర్త. (జ.1906). పశ్చిమ గోదావరి జిల్లా సెట్టిపేటలో 1906 సంవత్సరంలో మృత్యుంజయుడు, వేంకమాంబ దంపతులకు జన్మించారు. ఉన్నత విద్యాభాసం చేసి తత్త్వశాస్త్రం, చరిత్రలలో ఎం.ఏ. పట్టా పొందారు. వీరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శిష్యుడు. వీరు కొంతకాలం స్వరాజ్య పత్రికలో పనిచేశారు. 1926లో లా పట్టా పొందారు. కొన్నాళ్లు రాజమండ్రి, విశాఖపట్నం లలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. వీరు సంస్కృతాంధ్ర భాషలనే కాక, బెంగాలీ, హిందీ, పార్సీ, ఇంగ్లీషు, జర్మన్ మొదలైన నేర్చుకొని ఆయా భాషల సాహిత్యం గురించి పరిచయం చేసుకున్నారు. ముఖ్యంగా బెంగాలీ భాష ప్రభావం వీరి రచనలపై ఎక్కువగా కనిపిస్తుంది. 14 డిసెంబర్ 1965 తేదీన పరమపదించారు.
2008: జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (జ.1938) తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించాడు.
2014: పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1933)
పండుగలు , జాతీయ దినాలు
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.
అంతర్జాతీయ కోతుల దినోత్సవం.