డిసెంబ‌ర్ 16వ తేదీకి చరిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 16వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1951: సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉంది. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు, జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి.
1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ.
1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

ప్ర‌ముఖుల జననాలు


1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత (మ.1975).
1919: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. 1800 ఎకరాలు దానం చేసిన దాత (మ.2012).
1922: కుందుర్తి ఆంజనేయులు, వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడై, ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు (మ.1982).
1949: తోట తరణి, సుమారు 100 సినిమాలకు కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు.తోట తరణి స్వస్థలం బందరు. తండ్రి తోట వెంకటేశ్వర రావు నాటకరంగ కళాకారుడు. ఆడ వేషాలు వేయడంలో నేర్పరి. ఆయనకు ఎనిమిది మంది సంతానం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తం సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వెళ్ళాడు. మల్లీశ్వరి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. జయసింహ, అమరదీపం, పాండురంగ మహత్మ్యం, శంకరాభరణం, సిరిసిరిమువ్వ తదితర ప్రఖ్యాత సినిమాలకు ఆయనే కళాదర్శకుడు. దాంతో ఆయనకు మంచి పేరు వచ్చింది.

ప్ర‌ముఖుల మరణాలు

1774: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (జ.1694)
1928: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (జ.1866)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: