డిసెంబర్ 28వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?
ముఖ్య సంఘటనలు
1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.
1921: మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
ప్రముఖుల జననాలు
1856: ఉడ్రోవిల్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1859: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబర్ 28). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
1875: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, పండితుడు, కవి.(మ.1914)
1932: ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త.
1932: నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. వీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు.మొదట్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు.[5] ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు.
1937: ఇండియా - రతన్ టాటా, పారిశ్రామికవేత్త.
1940: వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు
1945: నేపాల్ - బీరేంద్ర, రాజు.
1952: ఇండియా - అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త.
1955: చైనా - లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.