అనేక విశేషాల సమహారం జనవరి 13... ఈరోజుకు చరిత్రలో ఎంతో ప్రాధాన్యం...
ముఖ్య సంఘటనలు
1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
1879: 'లయన్స్‌క్లబ్' స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జన్మదినం. అమెరికాకు చెందిన ఈయన 1917 అక్టోబరులో తన మిత్రులతో కలసి లయన్స్ క్లబ్‌ను స్థాపించారు. ఈ సంస్థకు సుమారు 160 దేశాల్లో 40 వేల శాఖలు ఉన్నాయి
1915: ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.
1943 : ఎడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు
ప్రముఖుల జననాలు
1879: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు.
1917: నల్లా రెడ్డి నాయుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు. (మ.1982)
1919: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)
1938: శివకుమార్ శర్మ, సంతూర్ వాద్య సంగీత విద్వాంసుడు.
1940: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయ వేత్త. గల్లీ నుండి ఢిల్లీకి ఎదిగిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. దివిసీమలోని కుగ్రామమైన నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెంలో అంబటి రాయుడయ్య, వెంకట సుబ్మమ్మలకు బ్రాహ్మణయ్య 13-01- 1940న జన్మించారు. రైతు కుటుంబలో జన్మించిన ఆయన వ్యవ సాయదారు డిగా తన జీవితాన్ని ప్రారంభించారు.
1949: రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు.
ప్రముఖుల మరణాలు
1977: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)
2014: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (జ.1927)
2016: అద్దేపల్లి రామమోహనరావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)
2016: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
2017: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927)