ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గరలో ఉందంటున్న డూమ్స్ డే క్లాక్..!

kalpana
ఇప్పటికే ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి వల్ల అతలాకుతలం అయింది. ఒకవైపు కరోనా మహమ్మారి మరొకవైపు అణు యుద్ధం ముప్పు, అదేవిధంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడానికి డూమ్స్ డే క్లాక్ అర్ధరాత్రికి దగ్గరగా చేరుకోవడంతో జరిగాయని సైంటిస్టులు భావిస్తున్నారు.ఈ విధంగా ప్రపంచానికి ఏదైనా ప్రళయం ముంచుకొస్తున్నప్పుడు డూమ్స్ డే క్లాక్ అర్ధ రాత్రికి చేరువగా వస్తుందని అటామిక్ సైంటిస్ట్ బులిటెన్ అధ్యక్షుడు రేచెల్ బ్రాన్సన్ చెబుతున్నారు. అసలు డూమ్స్ డే క్లాక్ అంటే ఏమిటి?దీని ద్వారా ప్రపంచంలో జరగబోయే విపత్తుల ఎలా పసిగడతారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...         

డూమ్స్ డే క్లాక్ భూమిపై జరగబోయే వైపరీత్యాలను, మానవాళి అంతంను తెలియజేస్తుంది. ఈ క్లాక్ ను 1947లో ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్‌, షికాగో యూనివర్సిటీ విద్యార్థులు కలిసి స్థాపించారు. అంతేకాకుండా ఈ క్లాక్ అభివృద్ధిలో బులిటెన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్టులు కూడా దీన్ని అభివృద్ధికి కృషి చేశారు. క్లాక్ ఆధారంగా ప్రపంచం అంతం అవడానికి ఎంత సమయం పడుతుందో దీని ద్వారా తెలియజేస్తారు. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ క్లాక్ లో టైం సెట్ చేస్తారు.

ఈ సందర్భంగా బులెటిన్ అధ్యక్షుడు రేచెల్ బ్రాన్సన్ మాట్లాడుతూ సైన్స్ పై విశ్వాసం లేకపోవడం, కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు తలెత్తాయని. అంతేకాకుండా రెండు రోజుల క్రితం అర్ధ రాత్రికి రెండు నిమిషాల పాటు దూరంగా ఉన్న ఈ డూమ్స్ క్లాక్ ప్రస్తుతం నూరు సెకండ్ల దూరంలోకీ రావడంతో ప్రపంచంలో మరో విలయం రాబోతోందని, గతంలో ఈ క్లాక్ ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ ప్రపంచం అణ్వాయుధాల‌తోనే అంతమవుతుందన్న ఉద్దేశంతో ఈ అటామిక్  సైంటిస్ట్స్‌లోని స‌భ్యులు అణ్వాయుధాల‌ను లేకుండా చేయాలని పిలుపునిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: