భారతదేశ గమనాన్ని మలుపు తిప్పిన సంఘటనలు... అవన్నీ ఈరోజే జరిగాయ...
ముఖ్య సంఘటనలు..
1857: ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది. కలకత్తా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మధ్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఇందుకు కారణం బ్రిటిషు వారు సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలగిస్తేనే పేలుతాయి. హిందూ-ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు . సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే
తెలుగుదేశం పార్టీని తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.
ప్రముఖుల జననాలు
1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.
1952: కె.ఎన్.వై.పతంజలి, తెలుగు రచయిత. (మ.2009)
ప్రముఖుల మరణాలు..
1932: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1885)
1953: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వ్యక్తి. (జ.1908)
2016: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (జ.1941)