మార్చి 31వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?
ముఖ్య సంఘటనలు
1919: హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
1959: 14 వ దలైలామా, టెన్జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
2011: 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు.
ప్రముఖుల జననాలు
1865: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887)
1928: కపిలవాయి లింగమూర్తి, సాహితీవేత్త, పాలమూరు జిల్లా కు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (మ. 2018).
1933: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు (మ.2011). ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. పదవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పేరిణి శివతాండవం నాట్యాన్ని పునరుద్ధరించాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన నవజనార్దనంను కూడా పునరుద్ధరించాడు. నటరాజ రామకృష్ణ 2011, జూన్ 7 న హైదరాబాదు లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
1939: సయ్యద్ హుసేన్ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత (మ.2008).నాటక రంగంలో మంచి నటుడిగా ఖ్యాతిగాంచిన సయ్యద్ బాషా హుసేన్ చలన చిత్రాలలో కూడా నటించారు. స్వయంగా స్క్రిపును రూపొందించిన 'పెద్దింటి కోడలు', 'ఉత్తమురాలు' సినిమాల్లో నటించారు. అటవీ శాఖలో రేంజర్గా ఉద్యోగ విరమణ చేసిన సయ్యద్ బాషా హుసేన్ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సినిమాలకు రచయితగా సహకారం అందించారు. చివరి వరకు నాటకరంగం మీదా ఎక్కువగా దృష్టిసారించిన సయ్యద్ బాషా హుసేన్ (స్వగ్రామమైన) యర్రగొండపాలెంలో 2008 డిసెంబరు 13న కన్నుమూశారు.
1960 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.
1987: కోనేరు హంపి, చదరంగ క్రీడాకారిణి.
ప్రముఖుల మరణాలు
1727: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643)
1972: మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932)
1995: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971)