మే6వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?!
ముఖ్య సంఘటనలు..
1910: ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
ప్రముఖుల జననాలు
1856: రాబర్ట్ పియరీ, ఉత్తర ధ్రువాన్ని చేరిన తొలివ్యక్తి (మ.1920).
1861: మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు (మ.1931).మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు, తండ్రి 'గంగాధర్' ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు. నెహ్రూ, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు నుండి బారిష్టరు డిగ్రీను పొందాడు. భారత జాతీయ కాంగ్రస్ కు చెందిన మధ్యేయవాద, ధనిక నాయకుడు. మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాడు. మోతీలాల్, స్వరూప్ రాణీని వివాహమాడాడు.
1868: రెండో నికోలస్, రష్యా జారు చక్రవర్తి (మ.1918).
1932: మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు (మ.1996).
1953: టోని బ్లెయిర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి.
1965: హరిశ్చంద్ర రాయల, రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి.
ప్రముఖుల మరణాలు
1910: ఎడ్వర్డ్ VII, ఇంగ్లాండు ఏడవ చక్రవర్తి (జ.1841).
1962: మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రకారుడు, శిల్పి, రచయిత.(జ.1910)ఈయన పశ్చిమ గోదావరి జిల్లా,పెదపాడు మండలానికి చెందిన వసంతవాడ గ్రామంలో 1910లో జన్మించాడు. పాశ్చాత్య చిత్రకళా రీతులపై, సిద్ధాంతాలపై లోతైన అధ్యయనం చేసి వాటిలోని మార్పులను, ధోరణులను వివరిస్తూ అనేక విలువైన వ్యాసాలను రచించి ప్రచురించాడు.
1976: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి (జ.1902).
2006: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత (జ. 1919).
2006: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత (జ.1927).
1971: పింగళి నాగేంద్ర రావు, తెలుగు చలనచిత్ర రచయిత.
పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం.
అంతర్జాతీయ డైట్ రహిత దినం.