నెల్స‌న్ మండేలా ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన రోజు...

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మే 9 వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..

1994: దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు.

ప్ర‌ముఖుల జననాలు..

1540: మహారణా ప్రతాప్, మేవార్ మహారాజు.
1866: గోపాలకృష్ణ గోఖలే, స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1915)భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సేవకుడు. భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖపాత్ర వహించాడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.
1933: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు.
1950: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (మ.2008)
1989: విజయ్ దేవరకొండ  మే 9, 1989 న హైదరాబాద్ లో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు దేవరకొండ గోవర్ధనరావు, మాధవిలు తెలంగాణాలోని నాగర్ కర్నూలు జిల్లా, బల్మూరు గ్రామానికి చెందినవారు., తెలుగు సినిమా నటుడు.నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు ఆయన. 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.2017 మొదట్లో ద్వారక అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డి తో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపం తో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు.
1992: సాయి పల్లవి, భారతీయ సినిమా నటి.

ప్ర‌ముఖుల మరణాలు..

1970: కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (జ.1908)
1981: దుర్గాబాయి దేశ్‌ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (జ.1909) చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, భారతదేశం యొక్క ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది
1986: టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత,


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: