జూన్ 8వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
ఏడాదిలో ఎన్నో తేదీలు కొన్ని సంఘ‌ట‌న‌ల‌కు సాక్ష్యంగా ఉంటాయి. ఆ రోజు ఏదో ఒక ప్ర‌త్యేక‌త జ‌రిగి మార్పున‌కు నాంది ప‌లికి ఉంటుంది. అలాంటి తేదీల‌ను గుర్తు పెట్టుకుని మ‌రీ మ‌నం సెల‌బ్రేట్ చేసుకోవ‌డం సాంప్ర‌దాయంగా న‌డుస్తుంది. ఇప్పుడు జూన్ 8వ తేదీకి చాలా ప్రాముఖ్య‌త ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.  
♥ జననాలు ♥
✦  1921: సుహార్తో అనే ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు ఈ రోజు జన్మించారు.
✦  1924: ప్ర‌ముఖ రచయిత డి.రామలింగం (మ.1993) జన్మించారు.
✦  1946:  టాలీవుడ్ న‌టుడు గిరి బాబు జన్మించారు.
✦  1957: భారత సినిమాల్లో ప్ర‌ముఖ నటి డింపుల్ కపాడియా జన్మించారు.
✦  1959: మాడుగుల నాగఫణి శర్మ, ప్ర‌ముఖ అవధాని జన్మించారు.
✦  1965: లక్ష్మణ్ ఏలె, ప్ర‌ముఖ భారతీయ చిత్రకారుడు ఈరోజు జ‌న్మించాడు.
✦  1975: భారత సినిమాలో నటి శిల్పా శెట్టి జన్మించారు.
 
♡ మరణాలు ♡
✦   1845: ఆండ్రూ జాక్సన్, ఈయ‌న అమెరికా మాజీ అధ్యక్షుడు మరణించారు.
✦   1938: బారు రాజారావు, ప్ర‌ముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శిగా చేసి మరణించారు.
✦   2002: భూపతిరాజు విస్సంరాజు, ఈయ‌న ప్ర‌ముఖ సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత మరణించారు.
✦   2012: ప్ర‌ముఖ తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ ఈయ‌న మరణించారు.
✦   2015: దాశరథి రంగాచార్య, సాహితీవేత్తగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మరణించారు.
✦   2017: ఇందారపు కిషన్ రావు ప్ర‌ముఖ అవధాని, కవి, బహుభాషా కోవిదుడు మరణించారు.
✦   2018: స్వాతంత్ర్య యోధుడు, మొదటి లోక్‌సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ మరణించారు.
✷ పండుగలు , జాతీయ దినాలు✷
✦  ప్రపంచ సముద్ర దినోత్సవం .
✦  అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినం.
 
✷ సంఘటనలు ✷
✦ 1958: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న స్వీడన్ లో ఈ రోజు ప్రారంభమయ్యాయి.
✦ 1990: ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్ కప్ పోటీలు ఇటలీ దేశంలో ప్రారంభమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: