జూన్ 11వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
ప్ర‌తి సంవ‌త్సరంలో గ‌ల అనేక తేదీల‌కు ఆరోజు ఎన్నో ప్రాముఖ్య‌త‌లు, విశేషాలు క‌లిగి ఉంటాయి.  ఆ తేదీలు ఎన్నో ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తాయి. ఖ‌చ్చితంగా ఆ రోజు మాత్రం ఏదో ఒక ప్రాముఖ్య‌మైన ఘ‌ట‌న‌లు జ‌రిగి ఉంటాయి. అలాంటి వాటిని మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ త‌ల‌చుకుంటాం. చరిత్ర‌లో ఈరోజు జూన్ 11కి చాలా విశేష‌మైన ప్రాముఖ్య‌త ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

♥ జననాలు ♥

✦  1924: భారతీయ ప్ర‌ముఖ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత అయిన అబు అబ్రహాం(మ.2002) జ‌న్మించారు.

✦  1932: నాట్యావధాని అయిన ధారా రామనాథశాస్త్రి(మ.2016) ఈ రోజు జ‌న్మించారు.

✦  1944: భారత పార్లమెంటు సభ్యుడు అయిన మేకపాటి రాజమోహన రెడ్డి జ‌న్మించారు. ఈయ‌న 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచారు.

✦  1947: బీహార్ రాజకీయ నాయకుడు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు జ‌న్మించారు.

 
♡ మరణాలు ♡

✦ 1963: దక్షిణ వియత్నాం కు చెందిన బౌద్ధ భిక్షువు టాయ్ క్వాంగ్ డుచ్ ఈరోజు మ‌ర‌ణించారు.

✦ 1979: హాలీవుడ్ నటుడు అయిన జాన్ వెయిన్(జ.1907) ఈరోజు మ‌ర‌ణించారు.

✦ 1983: భారత పారిశ్రామిక వేత్త అయిన ఘనశ్యాం దాస్ బిర్లా(జ.1894) మ‌ర‌ణించారు.

✦ 1987: భౌతిక శాస్త్రవేత్త అయిన బి.ఎస్.మాధవరావు (జ.1900) మ‌ర‌ణించారు.


✷ సంఘటనలు ✷

✦  1866: ప్రస్తుతం ఉన్న అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది ఈరోజు.

✦  1935: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ ప‌ట్ట‌ణంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు చూపించ‌డం జ‌రిగింది.

✦  1963: బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న దారుణ‌మైన దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా కాలిపోయాడు.

✦  1988: లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో ఈ రోజు నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు ఘ‌నంగా జరిగాయి.

✦  1988: ఐ.ఎన్.ఎస్ సింధువీర్ (జలాంతర్గామి పేరు) ఈరోజు భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.

✦  1988: సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఈరోజు ఉపయోగించడంతో చెలామ‌ణిలోకి వ‌చ్చింది.

✦  1998: తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషనును ఈరోజు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది.

✦  2001: ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు ఈ రోజు మరణశిక్ష అమలుపరిచారు.

✦  2010: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ఈరోజు ఘ‌నంగా ప్రారంభమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: