జూన్ 25వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
ప్ర‌తి ఏడాదిలో ఉండే ఎన్నో డేట్లు ఎన్నో విశేషాలు, వింత‌లు క‌లిగి ఉంటాయి. కాగా ఆయా డేట్ల‌లో ఎన్నో ర‌కాల ప్రాముఖ్య‌మైన ఘ‌ట‌న‌లు జ‌రుగి ఉంటాయి. కాబ‌ట్టి ఆ రోజు ఖ‌చ్చితంగా ఏదో ఒక విశేష‌మైన సంఘ‌ట‌న జ‌రిగుతుంది. అందుకే ఆ డేట్ల‌ను మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఆన‌వాయితీ. మ‌రి చరిత్ర‌లో ఈ రోజు జూన్ 25 కి కూడా ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. అదేంటో ,  అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా మరి.
♥ జననాలు ♥
✦  1878: భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు అయిన వఝల సీతారామ శాస్త్రిి (మ.1964) జ‌న్మించారు.
✦  1931: భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి అయిన విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ (మ.2008) జ‌న్మించారు.
✦  1945: దక్షిణ భారత సినీ నటి అయిన శారద జ‌న్మించారు.
✦  1957: తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉపకులపతి అయిన ఎన్.గోపి జ‌న్మించారు.
 ♡ మరణాలు ♡
✦ 1984: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (జ.1926) మ‌ర‌ణించారు.
✦ 2009: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు (జ.1958) మ‌ర‌ణించారు.
✦ 2009: శివచరణ్ మాథుర్, అసోం గవర్నర్ (జ.1926) మ‌ర‌ణించారు.
✦ 2019: దిగంబర కవులలో ఒకరు మహాస్వప్న మ‌ర‌ణించారు.

✷ జాతీయ పండుగ‌లు, దినోత్స‌వాలు ✷
ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం.
✷ సంఘటనలు ✷
✦  1932: భారతదేశం త‌న మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును (తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్) లార్డ్స్ మైదానంలో ఈరోజు ఆడింది.
✦  1975: భారతదేశం లో ఇందిరా గాంధీ, అత్యవసర పరిస్థితిని ఈరోజు దేశ‌వ్యాప్తంగా ప్రకటించింది.
✦  1983: భారత్ మొట్ట మొదటి సారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను ఈ రోజు సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: