భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి.. ఘనత వెనుక రహస్యం ఏమి..!

MOHAN BABU
 భారతరత్న అటల్ బిహారీ    వాజ్ పేయి 25 డిసెంబర్ 1924 న కృష్ణాదేవి, కృష్ణ బిహారీ వాజ్ పేయి దంపతులకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో పాఠశాల స్థాయి విద్య, విక్టోరియా కళాశాలలో హిందీ,ఇంగ్లిష్, సంస్కృతం లో డిగ్రీ ఆ తర్వాత కాన్పూర్ లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి ఎంఏ ప్రథమశ్రేణిలో  పూర్తి చేశారు.స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆయన న్యాయ విద్య కు మధ్యలోనే స్వస్తి పలికారు. 1957 లో బలరాంపూర్ నియోజక వర్గం నుండి పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టారు.

అటల్ బిహారీ వాజ్పేయి అద్వితీయమైన వాక్ పటిమకు మంత్రముగ్ధుడైన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజ్పేయి దేశ ప్రధాని అవుతాడని అన్నమాటలు 39 సం. తర్వాత నిజమయ్యాయి. విలువలతో కూడిన రాజకీయ జీవితానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ రాజకీయ దురంధరుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.వాజ్పేయి దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 27 మార్చి 2015 న దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రధానం చేసింది. అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమైన వాజపేయికి భారతరత్న ను ప్రదానం చేయడానికి స్వయంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన నివాసానికే తరలివెళ్లారు. ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 25 న భారత ప్రభుత్వం సుపరిపాలన దినంగా ప్రకటించింది.1975 నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో అనేకమంది విపక్ష నాయకులతోపాటు వాజ్పేయి కూడా అరెస్ట్ అయ్యారు. కర్ణాటక, గుజరాత్,మహారాష్ట్ర శాసన సభల్లో తన ఉనికిని విస్తరించుకొని జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించగా 1995లో జరిగిన పార్టీ సమావేశంలో krishna ADVANI' target='_blank' title='లాల్ కృష్ణ అద్వానీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాల్ కృష్ణ అద్వానీ వాజ్పేయి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం1996 ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాలు సాధించడం జరిగాయి. అటల్ బిహారీ వాజ్పేయి స్వయనా కవి, రచయిత అయిన ఆయన దీన్ దయాల్ ఉపాధ్యాయ సంపాదకీయంలో ప్రచురితమవుతున్న హిందీ పత్రికలు రాష్ట్ర ధర్మ, పాంచజన్య, స్వదేశ్, వీర్ అర్జున్ కు చేయూత నందించారు.

2005 డిసెంబర్ లో ముంబైలోని శివాజీ పార్క్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజ్పేయి క్రియాశీల రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.2012లో ది హిస్టరీ ఛానల్,రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో  అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన  ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో ఆయన 9వ స్థానంలో నిలిచారు. రాజ్యసభలో ప్రసంగం సందర్భంగా నాటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్, వాజ్పేయిని రాజకీయ భీష్మునికి అభివర్ణించడం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు ఒక మచ్చుతునక. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 16 ఆగస్టు 2018 న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: