ఎయిడ్స్ డే: రెడ్ రిబ్బన్ గుర్తుగా ఎందుకు చూపిస్తారు?

Purushottham Vinay
ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 1న నిర్వహిస్తారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం ఇంకా అలాగే ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక hiv కి వ్యతిరేకంగా పోరాడడం కోసం గాను ఈ వరల్డ్ ఎయిడ్స్ డేను జరుపుతారు.అయితే ఈ ఎయిడ్స్ డే రోజున ప్రతీ ఒక్కరు ఎర్ర రిబ్బన్ ధరిస్తారు. ఇది ఎయిడ్స్ డేకు ఒక చిహ్నంగా భావిస్తారు. మరి ఎయిడ్స్ దినోత్సవం రోజు రెడ్ రిబ్బన్ ధరించడానికి గల కారణాలేంటి.. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక ఈ ఎయిడ్స్ చిహ్నానికి 1988 వ సంవత్సరంలో బీజం పడింది. ఎయిడ్స్ పై ప్రపంచానికి అవగహన కల్పించే ఉద్దేశంతో కళకారులు, కళా సంస్థలు, కళా ప్రేక్షకులు ఇంకా అలాగే కళా నిపుణులు ఒక వీడియోను రూపొందించారు. ఈ కళాకారుల్లో కొంతమంది మూడేళ్ల తర్వాత అంటే 1991లో HIVతో జీవిస్తున్న వ్యక్తులు ఇంకా బాధితులను సంరక్షిస్తున్న వారికి సంఘీభావంగా ఓ వీడియో చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. ఇక ఆ తర్వాత వీడియో చిహ్నం అనేది రెడ్ రిబ్బన్ గా రూపాంతరం చెందింది. అంతకు ముందు సంవత్సరం గల్ఫ్ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ సైనికులు పసుపు రిబ్బన్‌ను ధరించడం జరిగింది.


ఈ రిబ్బన్ నుంచి ప్రేరణ పొందిన కళాకారులు.. HIVతో నివసించే వారికి మద్దతు ఇంకా అలాగే సంఘీభావాన్ని సూచించడానికి..అలాగే ఎయిడ్స్ తో మరణించిన వారిని గుర్తుంచుకోవడానికి ఎరుపు రిబ్బన్‌ను చిహ్నంగా ఉపయోగించాలని నిర్ణయించడం జరిగింది.ఇక స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన ప్రభుత్వేతర సంస్థ అయిన UNAIDS వెబ్‌సైట్ ప్రకారం.. మనుషులకు రక్తంతో అనుబంధం ఇంకా అలాగే కోపం నిదర్శనంతో పాటు... ప్రేమకు ప్రతిరూపంగా ఎరుపు రంగును తీసుకున్నట్లు ఈ రెడ్ రిబ్బన్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు చెప్పారు.ఈ రెడ్ రిబ్బన్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచానికి ఈ ఎయిడ్స్ డే సింబల్ ను దగ్గర చేసేందుకు రెడ్ రిబ్బన్ ప్రాజెక్ట్ వాలంటీర్లు USAలోని టోనీ అవార్డ్‌లకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా లేఖలతో పాటు.. ఎరుపు రిబ్బన్‌లను పంపించడం జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమంలో నటుడు జెరెమీ ఐరన్స్ రెడ్ రిబ్బన్ ధరించి మరింత మందికి స్పూర్తినివ్వడం జరిగింది. ఈ టెలివిజన్ కార్యక్రమాన్ని ఏకంగా 70 దేశాల్లో బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు చూడటం జరిగింది. అప్పట్లో చాలా మంది ప్రముఖులు కూడా ఎరుపు రంగు రిబ్బన్‌లను ధరించడం జరిగింది. ఇంకా అలాగే దీనికి తోడు యువరాణి డయానా కూడా రెడ్ రిబ్బన్ను ధరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: