చైనా, భారత్‌ మధ్య గోడ కట్టబోతున్నారా?

Chakravarthi Kalyan
సరిహద్దు గోడలు కుటుంబాల మధ్యనైనా సరే, రెండు దేశాల మధ్యనైనా సరే చాలాసార్లు సహజం. ఇప్పటివరకు మనం జర్మనీ వాల్ గురించి, జర్మనీ నుంచి విడదీసే వాల్ గురించి విన్నాం. చైనా వాల్ గురించి విన్నాం. రెండు దేశాలను విడదీసే ఒక గోడ ఇరువైపున వాళ్ళు ప్రేమతో కూల దూసేసిన ఉదాంతం కూడా విన్నాం. ఆ తర్వాత అద్భుతాల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి కూడా మనం బాగానే విన్నాం.

అయితే ఇప్పుడు భారత్ చైనా సరిహద్దుల్లో కూడా ఇటువంటి ఒక భారీ గోడను నిర్మించబోతున్నారన్నట్లుగా తెలుస్తుంది. భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్న నేపాల్, పాకిస్తాన్ ఇంకా చైనా ఇప్పటివరకు చాలా సార్లు సరిహద్దు వివాదాలు రాజేస్తూనే ఉన్నాయి. వాళ్లు తప్పు మనది అంటుంటే మనం వాళ్ళది తప్పు అంటూ ఉంటాం. ఈ చర్చ అనేది ఒక కొలిక్కి అయితే రాదు. ఇప్పుడు కొత్తగా బై లెటరేల్ అంటున్నారు.

దీనివల్ల మనం ఏం కోల్పోయేమో తెలియదు, సాధించేమో తెలీదు. ఈ సమస్యలన్నీ ఎందుకు ఈ దేశాల మధ్యన సరిహద్దులుగా గోడలు కట్టేస్తే సరిపోతుంది కదా అని తాజాగా ఆలోచన వచ్చినట్లు ఉంది. వారణాసిలో దీనిపై జరిగిన సమావేశంలో ఆ మేధావులు మన కేంద్ర మంత్రి జయశంకర్ ను ఒక ప్రశ్న అడిగారని తెలుస్తుంది. అయితే ఈ ప్రశ్నను జయశంకర్ తోసి పుచ్చారని తెలుస్తుంది.

గోడల నిర్మాణం అనేది సాధ్యం కాదు అని ఆయన చెప్పడం జరిగింది అని తెలుస్తుంది. ఒకవేళ భౌగోళిక పరంగా మనం కనుక గోడలను నిర్మిస్తే మనం 1962లో ఆక్రమించుకున్న భూభాగం అంతా దానికే రాసి ఇచ్చేసినట్లుగా అయిపోతుంది. జవహర్లాల్ నెహ్రూ రాసిచ్చేసినా సరే అది వాళ్ళ బాగమని మనం ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు అక్కడ గోడ కట్టడం వల్ల అది మన భూభాగం కాదని తేల్చి చెప్పేసినట్టు అయిపోతుంది అని జయశంకర్ తాజాగా తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: