చరిత్ర: నిజాం ఇండియాకు అంత గొప్ప సాయం చేశాడా?

Chakravarthi Kalyan
వాట్సాప్ లో ఇప్పుడు నిరాధారిత కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. పోస్టుల రూపంలో వచ్చే ఈ కథనాలు నిజమే అనిపించే రీతిలో ఉంటాయి. అలా అనుకొని మనం వాటిని షేర్ చేస్తూ ఉంటాం వాట్సాప్ గ్రూపులోకి. అయితే అది జనాల మైండ్ లోకి ఒక నిజం లాగో, ఒక అబద్ధం లాగో వెళ్ళిపోతుంది. అసలు విషయం ఎలా ఉన్నా కూడా, అసలు విషయం వేరైనా కూడా.


ఇలా వాట్సాప్ లో వచ్చే కొన్ని నిరాధారిత కథనాలు ప్రత్యేకించి మోడీని ద్వేషించే వాళ్లు ఎక్కువగా వాటిని నిజమన్నట్లుగా బలపరుస్తున్నారని అంటున్నారు కొంతమంది సామాజిక విశ్లేషకులు. ఈ మధ్యన బ్రిటిష్ వారిని, ఇంకా నిజాం నవాబులను గొప్ప వాళ్ళు అంటూ వాట్సప్‌లో కథనాలు రావడం జరిగిందట. భారతదేశం కష్టంలో ఉన్నప్పుడు డబ్బులు సహాయం చేశారని చెప్పుకొచ్చారట.


అయితే అసలు అది నిరాధారితమైనదని, నిజం కానే కాదని కొంతమంది అంటున్నారు. నిజాం నవాబు పిల్లికి బిచ్చం కూడా వేయడని, అలాంటి వ్యక్తి బంగారం ఇచ్చాడని అంటే ఎలా నమ్ముతున్నారని వాళ్ళు అంటున్నారు. మరి అసలు విషయం ఏమిటంటే 1965లో అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి పాక్ యుద్ధ సమయంలో జాతీయ యుద్ధ నిధి విరాళాల సేకరణ కోసం భారతదేశమంతా పర్యటించారు.


ఆ పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాదు కూడా వచ్చారు. అప్పుడు నిజాం నవాబు జాతీయ స్వర్ణ రక్ష నిధి కోసం 425 కిలోల బంగారం ఇచ్చారట. అయితే అది ఉచితంగా ఇచ్చారు అనుకుంటే పొరపాటే. 6.25% వడ్డీకి బాండ్లు తీసుకొని మరి నిజాం నవాబు ఇచ్చాడని అంటున్నారు. ఆధారం కావాలంటే భారత హోంశాఖ ఆర్కైవ్స్ లోకి వెళ్లి చూస్తే ఇది నిజమని అర్థమవుతుందని ఆ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, సినీనటి సావిత్రి బంగారాన్ని ఇస్తే, అప్పటి సినీ నటులంతా 8లక్షల రూపాయలు ఇచ్చారు. నిజాం నవాబు ఇచ్చింది ఏమీ లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: