ఇన్‌కమ్ ట్యాక్స్: ఇండియాలో ఎలా స్టార్ట్ అయ్యింది?

Purushottham Vinay
'ఇన్‌కమ్ ట్యాక్స్' అనే పదం గురించి గురించి చెప్పానవసరం లేదు. దీని గురించి అందరికీ తెలిసిందే.లెక్కకు మించిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రభుత్వానికి ఆదాయపు పన్నుని కట్టాల్సిందే.అయితే ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.



ఇన్‌కమ్ ట్యాక్స్ చరిత్ర విషయానికి వస్తే..తెలుస్తున్న నివేదికల ప్రకారం, మొదటి సారి 1860 జులై 24 వ తేదీన అంటే మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో సర్ జేమ్స్ విల్సన్ అనే బ్రిటీష్ అధికారి మనదేశంలో 'ఇన్‌కమ్ ట్యాక్స్' విధానాన్ని తీసుకువచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే దీని వెనుక ఒక ప్రధాన కారణం ఉన్నట్లు కూడా చెబుతారు. 1857 వ సంవత్సరం తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ పాలనకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ పథకం అనేది అమలులోకి వచ్చింది.ఇక ఆ తరువాత 1922 వ సంవత్సరంలో భారతీయులు సంపాదించే ఆదాయానికి పన్ను చెలించడం స్టార్ట్ చేశారు.



ఇక క్రమంగా 1939 నాటికి ఇందులో కొంత మార్పు చేశారు.2010లో దేశ ఆర్థిక శాఖ జులై 24ని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక దినోత్సవంగా ప్రకటించి ఈ ఉత్సవాలను అప్పటి ఆర్థిక మంత్రి ప్రారంభించారు. తరువాత ప్రతి ఏటా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగానే దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.మన దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ విధానానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు స్పష్టమైంది. కాగా ఈ ఆదాయ పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాక్స్ చెల్లింపులను ప్రోత్సహించడం ఇంకా అలాగే భవిష్యత్తులో ట్యాక్స్ సక్రమంగా చెల్లించేలా చేయడం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. పౌరులందరూ కూడా సకాలంలో ట్యాక్స్ కట్టినట్లయితే దేశం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు మసలుకోవాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: