కౌరవ- పాండవ రాజకుమారుల గురువైన ద్రోణచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని,ఏ మంచి గుణాలు లేని అతి చెడ్డ మనిషిని వెతకమని తన శిష్యులను ఆదేశించాడు. దుష్ట బుద్దిగల దుర్యోధనుడు అతి మంచి మనిషిని వెదకడానికి మొదట బయలుదారు. వెళ్లనప్రతిచో ట కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డగుణం చూసాడు. తన తల్లిదండ్రులతో సహ దోషులుగానే గుర్తించాడు. ఎవరూ అతనికి మంచిగా కనిపించలేదు.
కాని తనను గురించి తాను ఆలోచించించలేదు. కాని తనను గురించి తాను ఆలోచించకున్నపుడు అతనికి తనలో అన్నీ మంచి సుగుణాలే కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి పపంచంలో అందరికన్నా తానే మంచివాడినని తెలిపాడు.తనతో పోల్చిచూస్తే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉందని ద్రోణాచార్యునికి చెప్పాడు. అన్ని సద్గుణాలున్న పాండువ జ్యేష్టడు ధర్మరాజు మాత్రం ప్రపంచంలో అతి చెడ్డమనిషి తాను మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చాడు.
వాస్తవానికి ఆకాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. అయినా అతడు తనలో దోషాలును, ఎదుటి వారిలో మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయవిధేయతల కారణంగా తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు దర్మరాజు. ధర్మారాజు మాటలు విన్న ద్రోణుడు చాలా సంతోషపడ్డాడు. కాలక్రమంగా ధర్మరాజు సకల సద్గుణ సంపన్నుడిగా గుర్తింపబడ్డాడు. కానీ దుర్యోధను మాత్రం చెడు గుణాల పుట్టగా, తనను తాను నిరూపించుకున్నాడు.
ఈ కథలోని నీతి :
చెడ్డ మనసున్న మనిషికి ప్రపంచంలో అన్నీ చెడుగానే కనిపిస్తాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: