జయదేవపురం గ్రామంలో కమలమ్మ విమలమ్మ అనే ఇద్దరు మహిళలు ఇరుగుపొరుగు ఇళ్ళలో ఉండేవాళ్ళు. కలమలమ్మ పేదరాలయితే విమలమ్మకు ఆస్తపాస్లులు బాగానే వేండేవి. అయితే కలమలమ్మను ఆమె ఎప్పుడూ కష్టాల్లో ఆదుకేనేది కాదు. పైగా సూటిపోటి మాటలతో సాధిస్తుండేది.
కమలమ్మ కూలీనాలీ చేసుకుని సంపాదించిన కొంచె డబ్బుతో ఎలాగో కొద్దిగా బియ్యం మాత్రం కొనుక్కుని అన్నం వండుకొని పక్కింట్లో విమలమ్మ ఇంటి నుంచి వచ్చే కూరల వాసన పీలుస్తూ వట్టి అన్నం తింటుండేది. ఒక రోజు ఇది గమనించిన విమలమ్మ ‘నువ్వు నా కూరల వాసన పీలుస్తూ అన్నం తింటున్నావు కాబట్టి నాకు డబ్బు ఇవ్వాలి. ఇస్తావా లేదా ?’’ అంటూ పోట్లాడటం ప్రారంభించింది. ఈ పొట్లాట విని ఇరుగుపొరుగు వాళ్ళు గుమికూడారు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
న్యాయం కోసం ఇద్దరినీ గ్రామాధికారి దగ్గరికి తీసుకవెళ్లారు. గ్రామాధికారి అంతా విని ‘కమలమ్మా! నువ్వు సంపాదించిన డబ్బు ఇలా ఇవ్వు’’ అన్నాడు. కమలమ్మకు భయం వేసింది. అయినా గ్రామాధికారి ఆజ్ఞ ప్రకారం డబ్బు అతనికి ఇచ్చింది. గ్రామాధికారి ఆ డబ్బు అతనికి ఇచ్చింది. గ్రామాధికారి ఆ డబ్బుని ఒక చిన్నన మూట కట్టి ఆ మూటను చెట్టుకు వేలాడదీసి, ‘విమలమ్మా! చెట్టు కింద నీడలో కనిపించే ఆ డబ్బు సంచి నువ్వు తీసుకో, సరిపోతుంది.’’ అన్నాడు.
నీడ తీసుకోవడం ఎలా? అంటూ విమలమ్మ కస్సమంది. అందుకు గ్రామాధికారి ‘కమలమ్మ నీ ఇంట్లో కూర వాసన పీలుస్తున్నదే తప్ప కూర తినడం లేదు కదా! అందుకే డబ్బు సంచి నీడను నువ్వు తీసుకుంటే చెల్లుకు చెల్లు సరిపోతుంది. అన్నాడు. గ్రామాధికారి తీర్పుతో విమలమ్మకు కనువిప్పు కలిగింది. కమలమ్మతో స్నేహంగా ఉంటూ అవసరంలో ఆదుకోసాగింది.
కథ లోని నీతి : ఇరుగుపొరుగు వారితో స్నేహంగా ఉంటూ, అవసరంలో ఆదుకోవడం మన ధర్మం.
మరింత సమాచారం తెలుసుకోండి: