జలజలపారే నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు పై ఒక పక్షి గూడు కట్టుకొని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతుంది.
ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేతకోసం వెళ్లి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లలలో ఒకపిల్ల గూటి నుండి తల బయటికి పెట్టి ప్రపంచం చూస్తుంది. అంతలో తల్లివచ్చి ఆ పిల్లలని కోప్పడి ‘‘ఇంకెపుడు బయటకు చూడకూడదు పోరపాటున క్రిందపడవచ్చు లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్లవచ్చు’’ అని ముద్దుగా మందలించింది. మరునాటి ఉదయం ఆ పక్షి మేతకు వెళ్ళింది.
అమ్మమాట లెక్క చేయకుండా ఆపి పిల్ల మరల గూటి అంచువరకు వచ్చి బయటి వింతలను ఆదమరచి చూస్తుంది.
ఆ సమయంలో పెద్దగాలి వీయడంతో పట్టుతప్పి కాలుజారి నదిలోపడి కొట్టుకొని పోయి ప్రాణాలు వదిలింది. ఈ కథలోని నీతి : పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు.
మరింత సమాచారం తెలుసుకోండి: