పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి
తా ధనంబు బడయలేదు విత్తనమరచి
కోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ! వినుర వేమ !
బావము :
పూర్వజన్మలో ఒక్క పుణ్యకార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తులతూగాలని, స్వర్గ సుఖాలు అనుభ వించాలని కోరుకున్నంత మాత్రాన అవి లభిస్తాయా ?
విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడటం ఎంత అజ్ఞానమో పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలనూ, అష్టైశ్వర్యాలను కోరుకోవడం కూడా అంతే అజ్ఞానం.
మరింత సమాచారం తెలుసుకోండి: