గురువుతానయినను హరునితా జూపును,
బ్రహ్మలోక మితడు పాఱజూపు,
శిష్యునరసితట్టి చీకటి బాపురా,
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం
నిజమైన గురువు శిష్యునికి బ్రహ్మలోకమును, శ్రీహరిని కూడా చూపించగలడు. శిష్యుని భుజము తట్టి ధైర్య సాహసాలను నేర్పుతూ అతని మూర్ఖత్వాన్ని తొలగించును.
మరింత సమాచారం తెలుసుకోండి: