కుందేళ్లు – కప్పలు

Durga
 ఓ సారి కొన్ని కుందేళ్లు అడవిరేగు పొదల్లో సమావేశమయ్యాయి. ఆకాలంలో పొలాల్లో ఎలాంటి పంటలు లేని కారణంగా కుందేళ్లు ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి. ఆరోజుల్లోనే పగలు, సాయంకాలం ఊరిబయట తిరిగే వాళ్ల కుక్కలు కూడా వాటిని చాలా సతాయించడం మొదలెట్టాయి. మైదానాల్లోని పొదలు ఎండిపోయాయి. కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతుండటం మూలాన కుందెళ్లకు బయట రావాలంటే భయమేయసాగింది.  దిక్కుతోచక అవి ఒకచోట సమావేశమయ్యాయి. ఓ కుందేళు ఇలా అంది- ‘‘ బ్రహ్మదేవుడు మనజాతికి చాలా అన్యాయం చేశాడు. మనల్ని చిన్నవిగా చేతకాని ప్రాణుల్లా సృష్టించాడు. ఆదేవుడు మనకు దుప్పుల్లాగా కొమ్ములివ్వలేదు, పిల్లులకిచ్చినట్లు వాడిగోళ్లు కూడా ఇవ్వలేదు. శత్రువు నుంచి రక్షించుకోలేని నిస్సహాయస్థితిలో వున్నా. మనమీద ఎవరైనా దాడి చేస్తే మనకు పారిపోవడం తప్ప మరో మార్గం లేదు. భగవంతుడు కష్టాలన్నీ మన తలమీద రుద్దాడు. అంది. ఇంకో కుందేలు ‘ ఈ కష్టాలు, ఈ భయాందోళనలు నాకొద్దుబాబు! నేను ఏ చెరువులోనో పడి చచ్చిపోవాలనుకున్నాను.’ అని అంది. మరో కుందేలు ఇలా చెప్పింది.- నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను. నేను ఇంకెంత మాత్రమూ ఈ కష్టాలు పడలేను నేనిప్పడేవెళ్లి చెరువులో దూకి చస్తాను’’ మేము కూడా నీవెంటనే వస్తాం, మనమంతా కలిసి బతికాం, కలిసేచద్దాం,’’ – కుందేళ్లన్నీ ఒక్కసారి బిగ్గరగా అరిచాయి. అవన్నీ చావడానికని చెరువు వైపు సాగాయి. కుప్పలు తిప్పలుగా కప్పలు చెరువు గట్టుమీద కూర్చున్నాయి. కుందేళ్ల అలికిడి వినగానే అవి భయపడి చెంగుచెంగున చెరువులోకి దూకాయి. కప్పలు భయపడి నీళ్లలోకి దూకుడం చూసి కుందేళ్లు ఆగిపొయ్యాయి. అప్పడు ఓ కుందేలు తోటి మిత్రులతో ఇలా అంది – ‘‘ సోదురాలారా ! మనం చావాల్సిన పనిలేదు. రండి తిరిగి వెళ్దాం. దేవుని సృష్టిలో మనకంటే అల్పమైనవి, మనమంటే భయపడే ప్రాణులూ వున్నాయి. అవి కూడా బతుకుతున్నాయి. అలాంటప్పడు మనమెందుకు చావాలి. ? ఆ మాటలు విన్న మిగతా కుందేళ్లు ఆత్మహత్య, చేసుకోకుండా తిరిగి వెళ్లాయి. కష్టాలు వస్తాయి. కాని భయపడకూడదు. మనకంటే ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నవాళ్లు మనకంటే పేదలు, రోగాలపాలైనవాళ్లు ఈ ప్రపంచంలో ఎంతో మంది వుంటున్నారు. మనం వాళ్లకంటే సుఖంగా వున్నాం. అలాంటపుడు మనం ఎందుకు భయపడాలి? నీతి : ధైర్యానికి మించిన మిత్రుడులేడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: