బుడుగు : పిల్లలు చదివే ధ్యాసలో పడి తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా ...?

Suma Kallamadi

 

పిల్లలకు న్యూట్రిషన్​ ఫుడ్​ ఇవ్వకపోతే శారీరక, మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎదుగుదల కూడా ఉండదు. పరిస్థితులను అర్థం చేసుకొనే కెపాసిటీ ఉండదు. ఇమ్యూనిటీ తగ్గుతుంది. పిల్లల ఆకలి తీరిస్తే సరిపోదు, పోషక విలువలతో కూడిన మెనూ అందించాలి. ఉదయాన్నే పిల్లలను లేపాలి. స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాలి. ఇంటికొచ్చాక ట్యూషన్​​ చెప్పించాలి. చాలామంది పేరెంట్స్​ ఆలోచనలు ఇలానే ఉంటున్నాయి. దాంతో పిల్లలు చదువు ధ్యాసలో పడి సరైన తిండి తినడం లేదు. బర్గర్లు, పిజ్జాలు, చిప్స్​ తింటూ లంచ్​ను మానేస్తున్నారు. కొందరు పేరెంట్స్​ లంచ్​ బాక్సు​ల్లో ప్రాసెస్డ్​ ఫుడ్​ పెడుతున్నారని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇది హెల్దీ కాదు, అందుకే పిల్లలకు ఎలాంటి ఫుడ్​ ఇవ్వాలి? ఏ టైమ్​లో ఇవ్వాలి? ఇలాంటి విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

 

 


మార్కులు, ర్యాంకులు, పర్సంటేజీలు.. పేరెంట్స్​ వీటికే ప్రయారిటీ ఇస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ చూపడం లేదు. లేస్తూనే బడికి, వస్తూనే ట్యూషన్​కు వెళ్లే పిల్లలు ఎక్కువే. చదువుపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై కూడా చూపాలి.చదువులు, పరీక్షలు అంటు సాకుగా చూపి, ఫాస్ట్​ ఫుడ్​ తిని అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. పిల్లలకు చదువుతోపాటు సరైనవి తినడమూ అవసరమే.
చిన్న చిన్న అలవాట్లు హెల్దీగా ఉంచుతాయి. చాలా మంది డైలీ లైఫ్​ను తేలిగ్గా తీసుకుంటారు. అంటే సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం అవసరం. చదువుల కారణంగా పిల్లలు ఒక్కోసారి లంచ్​ స్కిప్​ చేస్తుంటారు. సక్రమమైన ఆహారపు అలవాట్లు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోతే బలహీనంగా తయారవుతారు.

 

 

 

చిన్న వయసులో న్యూట్రిషన్​ ఫుడ్​ ఇవ్వకపోతే శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. ఎదుగుదల కూడా ఉండదు. పరిస్థితులను అర్థం చేసుకొనే కెపాసిటీ ఉండదు. రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్​) తగ్గుతుంది. ‘విటమిన్, ఐరన్, క్యాల్షియం, అయోడిన్’ లాంటివి అందవు. దాంతో రోగ నిరోధకశక్తిపై ప్రభావం పడుతుంది. చిన్న చిన్న  ఫలితంగా చదువుపై ప్రభావం పడుతుంది. అనారోగ్యం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతారు. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్​ వీలైనంత వరకు తగ్గించాలి. ఒకే రకమైన ఆహారం ఇవ్వడం వల్ల కూడా సరిగా తినరు. లంచ్​ బాక్స్​లో పోషకాలు ఉండేలా మెనూ రెడీ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: