బుడుగు : అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలే శ్రేయస్కరం... !!

Suma Kallamadi

తల్లి పాలు అమృతంతో సమానం అని చెబుతారు. పుట్టిన కొన్ని గంటల్లోనే బిడ్డకు పాలు పడుతుంటారు.పుట్టగానే బిడ్డ తల్లి పాలు తాగుతుంటాడు . ఆ సమయంలో పెదవులు, దవడలు ఉపయోగించి రొమ్ము పాలు లాగడం ద్వారా కండరాలకు వ్యాయామం అందుతుంది. ఈ కారణంగా పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు రావు.తల్లిపాలలోని ప్రత్యేక గుణాలు పిల్లలని స్థూలకాయులుగా మార్చకుండా ఉంటాయని అనేక పరిశోధనల్లో తేలింది. కృత్రిమ పాలు తాగిన పిల్లల్లో స్థూలకాయులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

 

 

 

తల్లి పాలల్లో ఉబ్బసం వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి. సాధారణంగా కొంతమంది మరీ తక్కువ సమయంలోనే పిల్లలకు పాలు మాన్పించేలా చేస్తారు. కానీ, అలా చేయకూడదు. తప్పనిసరిగా బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకూ తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం. దీనికి మరే ప్రత్యామ్నాయం లేదని గుర్తించాలి. ఆరు నెలల తర్వాత ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టినా.. తల్లిపాలు ఇవ్వడం ఆపకూడదు. రెండేళ్ల వరకూ బిడ్డకు తల్లి పాలు పట్టొచ్చు. కొంతమంది పిల్లలు ఎక్కువ పాలు తాగుతారు. కొంతమంది తక్కువ తాగుతారు. ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతీ చిన్నారికి పాలు తాగే విషయంలో తేడా ఉండుంది. కాబట్టి.. మన చిన్నారి ఆరోగ్యంగా ఎదుగుతున్నంత కాలం కంగారు పడాల్సిన అవసరం లేదు.

 

 

అదే విధంగా.. కొంతమంది పిల్లలు రొమ్ము పాలకంటే, సీసా ద్వారా పాలు తాగుతారు. కానీ, రొమ్ము పాలు తాగించడమే అలవాటు చేయాలి. ఎందుకంటే ఇలా తాగడం వల్ల వారి దవడ కండరాలకు మంచి ఎక్సర్‌సైజ్ అవుతుంది. ఇందులోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. తల్లి పాలే తాగించాలి.అలాగే తల్లి పాలల్లో రోగనిరోధక శక్తిని ఎదుర్కునే పోషకాలు ఎన్నో ఉంటాయి. పాలు పట్టేముందు బిడ్డను ఓసారి ప్రేమతో దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల రొమ్ము ప్రేరేపణకు గురై పాలు వాటంతట అవే బయటకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: