బుడుగు : మీ పిల్లలు జలుబు దగ్గుతో బాధపడుతుంటే ఇంటి చిట్కాలు పాటించండి ఇలా .. !!!

Suma Kallamadi

వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లల్ని వేదించే ముఖ్యమైన సమస్య జలుబు,దగ్గు.దీనివల్ల పిల్లలు శ్వాసతీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. జలుబు,దగ్గు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము,తులసి ఆకులు వేసి మరిగించాలి.ఆ ఆవిరిని చిన్నారికి పట్టిస్తే దగ్గు చాలావరకు తగ్గిపోతుంది.అలాగే చల్లటి నీటిని తాగడం మాన్పించాలి.కాచి చలార్చిన నీటిని పిల్లలకు ఇవ్వడం ఉత్తమం..

 

 

పిల్లలు ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లని నీటిని తాగడానికి ఇష్టపడతారు.కానీ ఎట్టి పరిస్థితులలో పిల్లలకు చల్లటి నీరు తాగించకండి.అలాగే పసుపు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు తాగిస్తే ఎంతో రిలీఫ్‌గా ఫీలవుతారు.వేడి నీటి ఆవిరి పట్టినా కూడా కొంచెం ఉపశమనం కలుగుతుంది.రోజులో 15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది.లేదంటే కొంచెం విక్స్ గాని జండూబాల్మ్ గాని ఆ నీటిలో వేసి ఆవిరి పట్టించాలి. 

 

 

శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. రోజులో రెండు మూడు సార్లు తేనెను వారితో కొద్దికొద్దిగా పెడితే  వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. ఐదేళ్ళ వయసు పైబడిన పిల్లలకు తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తినిపిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి.అలాగే  వేడినీటిని మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా అల్లం రసం వేసి నిమ్మరసం,తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి పిల్లలతో తాగించాలి.ఇలా తాగించడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.పిల్లల్ని ఎక్కువగా వర్షంలో తడవనియ్యకుండా ఉంటే మంచిది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: